ఎన్‌సీపీలో చీలిక అందుకేనా ఎంపీ సంజయ్‌ రౌత్‌ వాదన

-

క్రిమినల్‌ కేసుల దర్యాప్తు ఎన్‌సీపీలో చీలిక తెచ్చిందన్నారు ఎంపీ సంజయ్‌ రౌత్‌. కేసుల దర్యాప్తు వేగంగా జరుగుతున్నందున ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికే అజిత్ పవార్ తన బెటాలియన్‌తో కలిసి షిండే ప్రభుత్వంలో విలీనమయ్యారని ఆయన ఆరోపించారు. మరి ఎంపి సంజయ్‌ రౌత్‌ ఆరోపణలు నిజమేనా…ప్రస్తుతం ఈ అంశమే హాట్‌ టాపిక్‌గా మారింది. కేవలం కేసుల నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనే అజిత్‌ సవార్‌ ఎన్‌సీపీని వీడారని అనుకుంటున్నారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం చాలా ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అజిత్ పవార్‌తో సహా తొమ్మిది మంది NCP నాయకులు షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు. ఉప ముఖ్యమంత్రిగా గవర్నర్‌ సమక్షంలో అజిత్ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు.ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాటలను బట్టి చూస్తే షిండే-ఫడ్నవీస్‌ ప్రభుత్వంలో విలీనమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్ మరియు అతని సహచరులపై ఏమేమి కేసులు ఉన్నాయో ఇప్పుడు ఓసారి పరిశీలిద్దాం.

కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్‌పై ఆర్థిక నేరాల విభాగం విచారణ జరుపుతోంది.ఇందులో అజిత్‌ పవార్‌ని ప్రధాన నిందితుడిగా ఈడీ పేర్కొంది. అయితే మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వ హయాంలో అజిత్‌పై చేసిన విచారణ ముగిసింది. అయితే ప్రభుత్వం మారడంతో దర్యాప్తు సంస్థ మరోసారి విచారించేందుకు పాత కేసును తెరీమదకి తీసుకొచ్చింది. గడిచిన ఏప్రిల్‌లో చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. అంతేకాదు నీటిపారుదల కుంభకోణంలో ఆయనపై ఏసీబీ విచారణ జరిపి బాంబే హైకోర్టులో క్లీన్ చిట్ ఇస్తూ నివేదికను దాఖలు చేసినా కోర్టు ఆ నివేదికను ఇంకా ఆమోదించకసోవడం గమనార్హం.2006లో పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్న ఛగన్ భుజబల్ సమయంలో రూ.100 కోట్ల కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆయనపై కేసు నమోదైంది.

ఈడీ కూడా మనీలాండరింగ్‌పై ప్రత్యేక కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేసింది. రెండేళ్ల పాటు జైలులో ఉన్న ఆయనకు బెయిల్ వచ్చింది. ముంబై యూనివర్సిటీ అవినీతి కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టులో కేసు నమోదు చేసింది.ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.సర్ సేనాపతి శాంతాజీ ఘోర్‌పాడే షుగర్‌ ఫ్యాక్టరీ లిమిటెడ్‌……. హసన్ ముష్రిఫ్ కుటుంబానికి సంబంధించిన కంపెనీ ఇది. అయితే పనితీరులో అవకతవకలు జరిగాయన్న అంశంపై ED దాడులు నిర్వహించింది. ఏప్రిల్‌లో అతని ముందస్తు బెయిల్ దరఖాస్తును ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.కానీ అతను హైకోర్టుని ఆశ్రయించి బెయిల్‌ పొందాడు. ఆయన ముగ్గురు కుమారుల ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ప్రత్యేక కోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉంది.ఇంకా పలువురు నేతలపై చిన్న చిన్న కేసులు ఉన్నా….వాటిని పెద్దగా చూపించి విచారణల పేరుతో విధిస్తున్నారు. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం కోసమే అజిత్‌ పవార్‌ షిండే-ఫడ్నవీస్‌తో చేతులు కలిపారనేది సంజయ్‌ రౌత్‌ వాదన.

అజిత్ పవార్ ప్రభుత్వంలో చేరడం పట్ల ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం ఉందని, అజిత్ పవార్ అనుభవం రాష్ట్రాన్ని బలోపేతం చేస్తుందన్నారు సీఎం. అయితే మహారాష్ట్రలో రాజకీయాల ఆట మారవచ్చేమో కానీ కథ మాత్రం చాలా పాతదే.

Read more RELATED
Recommended to you

Latest news