ఫోన్ ట్యాపింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. అసలు ఇంతకీ ఎవరి ఫోన్ ట్యాపింగ్ జరిగిందో తెలుసా ?
మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ కమిషనర్ రష్మీ శుక్లా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఫడ్నవిస్ కు సమన్లు జారీ చేయవలసిందిగా పోలీసులను ఆదేశించింది.
రాష్ట్ర ఉద్యోగుల బదిలీలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఫడ్నవిస్ ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో అప్పటి ఇంటెలిజెన్స్ కమిషనర్ రష్మీ శుక్లా, అప్పటి రాష్ట్ర డీజీపీ జైస్వాల్ తో బదిలీలలో జరిగిన అవకతకలు జరిపిన సంభాషణ కూడా ఉంది. ఈ బయటికి పొక్కడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీని మీద తక్షణమే విచారణకు ఆదేశించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.