మునుగోడులో మూడు స్తంభాలాట.!

-

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. అయితే ఇప్పటికే బిఆర్ఎస్ తన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచార పర్వానికి తెర లేపింది. ఇక కాంగ్రెస్ సైతం రేసులో దూకుడుగా ఉంది. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు పెరిగింది అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈసారి బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు అందరూ ఎవరిని తమ అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆందోళనలో ఉన్నారు. ఇక కీలకమైన మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ముగ్గురు నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. వారిలో చలమల కృష్ణారెడ్డి, పున్నా కైలేష్, పాల్వాయి స్రవంతి ఉన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థిని నేనే అని చలమల కృష్ణా రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. సభలలో సమావేశాల్లో అన్ని తానై ముందుండి నడిపిస్తున్నారు.  రేవంత్ రెడ్డి ఇటీవల బీసీలకు కాంగ్రెస్ లో పెద్దపేట వేస్తామని చెప్పిన వార్తలతో కైలాష్ బీసీ సామాజిక వర్గం వాడిని తానేనని, ఈసారి మునుగోడు బరిలో నిలిచేది నేనేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పటినుంచో కాంగ్రెస్ ను నియోజకవర్గంలో కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా కుటుంబం తమదని గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతి అంటున్నారు. ఢిల్లీ పెద్దల ఆశీర్వాద బలం తనకే ఉందని ఈసారి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని ప్రచారం చేస్తున్నారు. మరి వీరి ముగ్గురు వాదనలకు చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సిందే. పైగా ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించేలా లేరు. దీని వల్ల కాంగ్రెస్‌కు నష్టమే.

Read more RELATED
Recommended to you

Latest news