జనసేన అధినేత పవన్ ఏం అయ్యారు. వారాహి మూడు విడతల యాత్ర చేసిన పవన్…మళ్ళీ ఏపీ రాజకీయాల్లో అడ్రస్ లేరు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారాహి మూడు విడతల యాత్ర విజయవంతమైంది. జనసేనకు కాస్త ఊపు వచ్చింది. ఇలాంటి సందర్భంలో పవన్ మళ్ళీ రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల రాజకీయంగా జనసేన ఫామ్ కోల్పోయిందని చెప్పవచ్చు.
ఇలాంటి పరిస్తితులు వల్ల జనసేనకు చాలా ఇబ్బంది అవుతుంది. రాజకీయంగా ఏ పార్టీ అయిన సత్తా చాటాలంటే మొదట ఆ పార్టీ అధినేతలు నిత్యం ప్రజల్లోనే ఉండాలి. అలా కాకుండా కొన్ని రోజులు కనిపించి..మళ్ళీ కొన్ని రోజులు కనిపించకపోవడం వల్ల పార్టీ బలోపేతం కాదు. ఇప్పుడు జనసేన పరిస్తితి కూడా అదే అవుతుంది. ఇక పవన్ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల జనసేన బాధ్యతలు నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. అయితే పవన్‌కు ఉన్న మీడియా అటెన్షన్ నాదెండ్లకు ఏ మాత్రం ఉండదు. దీని వల్ల జనసేన గురించి చర్చ ఉండదు.
ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ, టిడిపిల మధ్యే పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన వెనుకబడింది. ఇక నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. తాజాగా భీమవరంలో వైసీపీ శ్రేణులు..లోకేష్ పాదయాత్రపై రాళ్ళు రూవ్విన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టిడిపి శ్రేణులపై కేసులు నమోదయ్యాయి.
ఇక లోకేష్ పాదయాత్రపై రాళ్ళు రువ్వడాన్ని నాదెండ్ల మనోహర్ ఖండించారు. విశాఖలో తమ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలలో వైసీపీ నేతలు రెచ్చగొట్టడంతో పాటు దాడులు చేశారని ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలోను వైసీపీ అల్లరి మూకలు అలాగే చేస్తున్నాయని అన్నారు.
అసలు ప్రతిపక్షాల ర్యాలీలలో వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే బ్యానర్లు కడుతున్నారని.. దీనిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆరు నెలలు ఓపిక పడితే జగన్ ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. మొత్తానికి లోకేష్‌కు జనసేన పరోక్షంగా సపోర్ట్ ఇస్తుంది.