ఇటీవల బీజీపీ- జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఇక జనసేన నేత నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ మధ్య అధికార పార్టీ వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. తాజాగా నాగబాబు ‘డియర్ జగన్ రెడ్డి గారూ ఇది నా అభ్యర్థన’ అంటూ జనసేన నేత నాగబాబు ట్వీట్లు చేశారు. ‘దయచేసి మీ తప్పులను సరిదిద్దుకుని, మిగిలిన నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించండి. మీకు అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని మీరు అనుకుంటే రాష్ట్ర ప్రజలతో గొడవ పెట్టుకోకండి, గందరగోళానికి గురవ్వకండి’ అని పేర్కొన్నారు.
‘మీ తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు ఇప్పటికీ సమయం ఉంది. మీరు తప్పులు చేయాలని మేము కోరుకోము. మీరు చేసే తప్పుల ఆధారంగా రాజకీయ ప్రయోజనాలు పొందాలని మేము అనుకోము. ఇటువంటి ఆలోచనలు జనసేన పార్టీకి లేవు. మీ ఎమ్మెల్యేలను నియంత్రణలో పెట్టుకోండి.. మీ విక్టరీని వారు నాశనం చేస్తారు. మీ నిర్ణయాలను విమర్శించే అవకాశాన్ని మాకు ఇవ్వకండి. రాష్ట్ర ప్రజలందరినీ ఒకేలా చూస్తూ వారిని ప్రేమించండి.. కనీసం మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలా ఉండడానికి ప్రయత్నించండి’ అని నాగబాబు చెప్పారు.
Dear jagan reddy garu.its my simple request ..Plz correct your mistakes and rule the state for next 4 and odd https://t.co/cAxL6UBiN2 have 151 mla’s strength.if you think you can do really good governance.dont mess up the state and mess up yourself.its my honest request.
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 18, 2020