నల్గొండలో కంచర్లకు కోమటిరెడ్డి చెక్ పెడతారా?

-

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ తమ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్ షోలు, సభలు, సమావేశాలు, వరాల జల్లులు, హామీలతో ఎన్నికల హడావిడి ఓ రేంజ్ లో నడుస్తోంది. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు చావో రేవో లాంటివి. ఈసారి కూడా గెలవకపోతే కాంగ్రెస్ కు తెలంగాణలో స్థానమే లేదని బిఆర్ఎస్ విమర్శిస్తోంది. బిఆర్ఎస్ విమర్శలను తిప్పికొడుతూ ఈసారి తెలంగాణలో అధికారం చేపట్టేది తామేనని కాంగ్రెస్ చెబుతోంది. బిఆర్ఎస్ అవినీతి, అక్రమాలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారు. కంచర్ల భూపాల్ రెడ్డి గతంలో కోమటిరెడ్డి పై విజయం సాధించి నల్గొండలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఓటమి ఎరుగని నేతగా పేరున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కంచర్ల భూపాల్ రెడ్డి ఓడించి విజయం సాధించారని గొప్పగా చెప్పారు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా  గెలుపొంది తన హవా తగ్గలేదని నిరూపించారు. నల్గొండలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తన ఓటమికి అధికార పార్టీ కుయుక్తులే కారణమని కోమటిరెడ్డి విమర్శలు చేశారు. ఇప్పుడు అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి తన సత్తా చూపాలని కోమటిరెడ్డి భావిస్తున్నారు. కచ్చితంగా భారీ మెజారిటీతో నల్గొండను తాను సొంతం చేసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. కంచర్ల భూపాల్ రెడ్డి నియోజకవర్గానికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అవి ప్రజల ముందుకు పూర్తిగా చేరలేదని విమర్శలు ఉన్నాయి. వీటితోపాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లాబిస్తుందని చెప్పవచ్చు.

కోమటిరెడ్డి విజయానికి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు రాష్ట్రంలో వీస్తున్న కాంగ్రెస్ గాలి కూడా కలసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి కి ఉన్న పట్టు, కాంగ్రెస్ కు నల్గొండలో పట్టు ఉండడంతో ఈసారి నల్గొండలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే, గెలిచేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు కంచర్ల భూపాల్ రెడ్డి కూడా ఏ మాత్రం తక్కువ కాదు. ఇద్దకి మధ్య టఫ్ ఫైట్ నడవటం ఖాయం..మరి ఈసారి నల్గొండ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news