విశాఖ వెళ్లేది మీ ల్యాండ్‌ మాఫియాకోసమేగా: నారా లోకేష్‌

-

ఏడు నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదు…వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని టీడీపీ నేత నారా లోకేష్‌ ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆధారాలు బయటపెట్టమని అడిగితే జగన్ కాకి లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. `4,075 ఎకరాలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అమరావతి ప్రాంతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు 1170 ఎకరాలు. మరి 4,075 ఎకరాల ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో. భ్రమల్లో బతుకుతున్న వైసీపీ నాయకులు, ఉపసంఘం మేధావులు చెప్పాలి. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు మేం సిద్ధం` అని లోకేష్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

అలాగే అద్భుత రాజధానిగా అమరావతిని ఎలా తీర్చిదిద్దవచ్చునో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెబుతున్నా, లక్ష కోట్ల ఖర్చు సాకుతో విశాఖవైపు చూస్తున్నది మీ ల్యాండ్‌ మాఫియా కోసమే కదా? అని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ సందేశం ఉంచారు. మీ స్వార్థం కోసం అమరావతిని చంపేయడం ఎంత వరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...