జగనన్న వచ్చాడు.. వరల్డ్ బ్యాంక్ పోయింది… ఆయన కల నెరవేరిందిగా… లోకేశ్ సెటైర్లు

-

జగనన్న వచ్చారు.. వరల్డ్ బ్యాంక్ పోయింది. ఇప్పుడు జగన్ గారి కల నెరవేరింది. మొత్తానికి అమరావతిని పడగొట్టేశారు. రైతులను రెచ్చగొట్టడం, పంటలు తగలబెట్టడం, దొంగ ఉత్తరాలు, ఇలా జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవంది.. అంటూ లోకేశ్.. జగన్ పై సెటైర్లు వేశారు..

అయ్యో… అయ్యో… చంద్రబాబే కాదు నా కలల రాజధాని అమరావతి ఇక కలగానే మిగిలిపోవాల్సిందేనా? అంటూ నారా లోకేశ్ నెత్తినోరు బాదుకుంటున్నారు. తన ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

జగనన్న వచ్చారు.. వరల్డ్ బ్యాంక్ పోయింది. ఇప్పుడు జగన్ గారి కల నెరవేరింది. మొత్తానికి అమరావతిని పడగొట్టేశారు. రైతులను రెచ్చగొట్టడం, పంటలు తగలబెట్టడం, దొంగ ఉత్తరాలు, ఇలా జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవంది. బాబుగారి హయాంలో కళకళలాడిన అమరావతి మీ తుగ్లక్ చర్యలతో ఖాళీ అయిపోయింది.

అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే కార్యాచరణలో జగన్ గారు మొదటి అడుగు విజయవంతంగా వేశారు. ఇక ఆంధ్రుల కల రాజధాని కేవలం కలగానే మిగిలిపోతుందేమో.. అంటూ లోకేశ్.. జగన్ మీద ట్వీట్ల వర్షం కురిపించారు.

ఇంత జరిగిన తర్వాత కూడా మంత్రి బుగ్గన గారు 2006లోనే వైఎస్ అధిక వడ్డీకి మీరు ఆంధ్రాకు లోన్ ఇవ్వొద్దు అంటూ వరల్డ్ బ్యాంక్ కు లేఖ రాశారు. అందుకే ఆయనపై ఉన్న గౌరవంతో వెనక్కి వెళ్లారు.. అని లేఖ తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు.. అంటూ మంత్రి బుగ్గనపై కూడా లోకేశ్ ఫైర్ అయ్యారు.

అసలు లోకేశ్ కు ఏమైంది. ఏంటి ఈ ట్వీట్లు అంటారా? ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు 300 మిలియన్ డాలర్ల రుణ సాయం చేయడానికి ఇంతకు ముందే ముందుకు వచ్చింది. తర్వాత ఏమైందో ఏమో కాని.. ఏపీ ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ షాకిస్తూ… అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించింది. ఈనేపథ్యంలో లోకేశ్.. జగన్ సర్కారుపై ట్వీట్ల రూపంలో ఘాటు విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news