ఆసక్తికరంగా మారిన హర్యానా ఎన్నికలు.. మోడీ మానియా వర్కౌట్ అవుతుందా..?

-

అక్టోబర్ ఒకటన హర్యానాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి పడింది.. బిజేపీ, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్దులుగా ఉన్న ఈ రాష్టంలో దశాబ్దం తర్వాత ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది.. బిజేపీ తప్పిదాలను క్యాష్‌ చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది..అందుకోసం అగ్నిపథ్, రైతులకు మద్దతు ధర, రెజ్లర్స్ సమస్యలను ప్రధాన అస్త్రాలుగా ఆ పార్టీ రంగంలోకి దిగబోతుంది..

2014,2019లో అదికారాన్నిచేజిక్కించుకున్న బిజేపీ హ్యట్రిక్ కోసం వ్యూహ్మకంగా అడుగులు వేస్తోంది.. పంజాబ్ లో అనుహ్య విజయం సాధించిన ఆమ్ ఆద్మీ కూడా తమ అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది.. 90 అసెంబ్లీ స్తానాలుగా హర్యానా కు అసెంబ్లీ గడువు ఈ ఏడాదివ నవంబర్ 3 తో ముగియబోతుంది.. చేసిన అభివృద్దిని చెప్పుకుని మరోసారి గెలవాలని బిజేపీ భావిస్తోంది..
50 పైచిలుకు స్థానాలను గెలుచుకోవాలని కమలనాథులు స్కెచ్ వేస్తున్నారు..

ఈ రాష్టంలో ప్రధాన పోటి బిజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నప్పటికీ.. జేజేపీ, ఐఎన్ ఎల్ డీ, బిఎస్పీలకు కూడా బాగానే ఓటు బ్యాంకు ఉంది.. గత ఎన్నికల్లో జేజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజేపీ.. ప్రస్తుతం జేజేపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది.. జేజేపీ కూడా బిజేపీకి అధికారాన్ని దక్కనివ్వమని చెబుతోంది.. కాంగ్రెస్ కూడా బిజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది.. కానీ బిజేపీ మాత్రం స్వంతంగా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహ రచన చేస్తోంది.. అన్ని పార్టీలు హర్యానా మీద ఫోకస్ పెట్టడంతో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news