ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ ఇదేనా..?: కేటీఆర్

-

రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత గ్రామం కొండారెడ్డి పల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిలపై సీఎం అనుచరులు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇద్దరూ మహిళలు ఏం తప్పు చేశారు..?

రేవంత్ రెడ్డి లెక్క అడ్డమైన భాష మాట్లాడారా..? లేక బూతులు తిట్టారా..? అని నిలదీశారు. కొండారెడ్డి పల్లెల్లో రుణమాఫీ జరిగిందా అని తెలుసుకునేందుకు వెళ్తే.. కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం ఏంటి..? అని ప్రశ్నించారు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా బురదలో నెట్టేసి.. కొట్టి.. అసభ్యంగా ప్రవర్తించి వాళ్లకు అవమానం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రుణమాఫీ 100 శాతం చేసింది నిజమైతే భయం ఎందుకు..? నువ్వు పుట్టిన ఇంటి ముందు ఇద్దరూ ఆడబిడ్డలకు అవమానం చేశావని ప్రశ్నించారు కేటీఆర్. మహిళా కమిషన్ కూడా ఈ దాడిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news