జూనియర్ ఎన్టీఆర్ మామకు కీలక పదవి అప్పగించిన జగన్..!

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస రావుకు వైఎస్సాఆర్సీపీలో కీలక పదవి దక్కింది. అయన ఇటీవలే వైఎస్సాఆర్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన్ను పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యుడిగా నియమించారు. ఈ విషయాన్ని వైఎస్సాఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. జగన్ ఆదేశాల మేరకే నార్నెను సీజీసీ సభ్యుడిగా నియమించారు.

Narne Srinivasa rao appointed as YSRCP CGC Member

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఏపీ సీఎం గా చూడాలన్నదే తన కోరిక అని… దాని కోసమే వైఎస్సాఆర్సీపీలో చేరినట్టు నార్నె అప్పుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఫిబ్రవరి 28న వైసీపీలో చేరారు. వైఎస్ జగనే ఏపీని అభివృద్ధి చేయగలరనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ కుటుంబానికి, నార్నెకు చాలా ఏళ్ల నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. నార్నె శ్రీనివాస రావు కూతురు లక్ష్మీ ప్రణతిని ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. వీళ్ల సంబంధం ఫిక్స్ చేసింది చంద్రబాబే అని చెబుతుంటారు. అయితే.. చంద్రబాబు పాలన మాత్రం ఏమాత్రం బాగోలేదని ఆయన ఇదివరకే విమర్శించిన సంగతి తెలిసిందే.