సోమవారం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా పడమరవైపు చంద్రుడు, కుజుడు కన్పిస్తారు. ఈ యోగమే చంద్రమంగళ యోగం అంటారు. అరుదుగా ఇటువంటి కాంబినేషన్స్ వస్తుంటాయి. సోమవారం, భరణి నక్షత్రం, శుక్ల పంచమినాడు చంద్రుడు, కుడిపక్కన కుజుడు చిన్న చుక్కగా ఎరుపు రంగులో కన్పిస్తాడు. తప్పక ఈ ఖగోళ వింతను చూసి ఆనందించండి. విశ్వాసం ఉన్నవారు ఆ రెండు గ్రహాలకు మనస్సులో ధ్యానం చేసుకుని నమస్కారం చేయండి. తప్పక మహాలక్ష్మీ కటాక్షం లభిస్తుంది. నేటి నుంచి 21 వరకు దీనికి సంబంధించిన యోగాలు ఉన్నాయి. వెంటనే ఆకాశంలో పడమరవైపు చంద్రుడు, కుజుడుని దర్శించండి. తరించండి.
ఓం నమో చంద్రాయనమః, ఓం నమో అంగారకాయనమః
– కేశవ