నెల్లూరు వైసీపీ అభ్యర్ధులు ఫిక్స్..మళ్ళీ వన్‌సైడ్ విక్టరే.!

-

మరొకసారి ఏపీలో అధికారం దక్కించుకునే దిశగా జగన్ వెళుతున్నారు. మళ్ళీ టి‌డి‌పికి చెక్ పెట్టి సింగిల్ హ్యాండ్ తో వైసీపీని గెలిపించనున్నారు. జగన్ ఇమేజ్ తో వైసీపీ విజయం దిశగా వెళుతుంది. ఇక పూర్తిగా వైసీపీ హవా ఉండే జిల్లాల్లో మళ్ళీ సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరులో మళ్ళీ వైసీపీ వన్‌సైడ్ గా గెలవడం ఖాయం.

ఇక ఇక్కడ వైసీపీ అభ్యర్ధులు దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే..మళ్ళీ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమే. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టి‌డి‌పి వైపుకు వెళ్లారు. దీంతో వైసీపీకి 7 గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 7 గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మళ్ళీ సీటు దక్కే వారు..సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫిక్స్..అక్కడ ఈజీగా గెలుస్తారు. ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేస్తారు. నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్, కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెడీ.

సూళ్ళూరుపేటలో సంజీవయ్య, కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేయడం ఖాయం. ఇటు నెల్లూరు రూరల్ లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. వెంకటగిరి సీటు తాజాగా జగన్..నేదురుమల్లి రామకుమార్ రెడ్డికి ఫిక్స్ చేశారు. అటు ఉదయగిరి సీటు మేకపాటి ఫ్యామిలీ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఒక గూడూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు డౌట్..మిగిలిన సీట్లు దాదాపు ఫిక్స్ అని చెప్పవచ్చు. మొత్తానికి నెల్లూరులో ఈ సారి వైసీపీ 7 సీట్లు ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news