అసలే కరోనా తో చస్తుంటే మహేష్‌, విజయ్‌ల గోల ఏంటి రా బాబు !

-

మామూలుగా సినిమా రంగంలో పెద్ద పెద్ద స్టార్ హీరోల అభిమానుల మధ్య డిస్కషన్స్ ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అభిమానుల మధ్య భయంకరమైన ఫ్యాన్స్ వార్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో ఎక్కువగా అజిత్ మరియు విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఓ రేంజిలో ఉంటాయి. మొదటి సినిమా రిలీజ్ అయినా గాని ఒకరిని ఒకరు కించపరిచే విధంగా ఈ ఇద్దరు హీరోల అభిమానులు హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకుని సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. కోలీవుడ్ ఇండస్ట్రీ తో పోల్చుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంచెం ఇటువంటి గొడవలు తక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే తమిళ అభిమానుల దెయ్యం తెలుగు ఫ్యాన్స్ కి ఇటీవల పట్టింది ఏమో తెలియదు గానీ హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తూ గొడవ పడే కల్చర్ మనకు కూడా పాకింది.DummyStarMaheshBabu Vs RemakeStarVijayమహేష్, పవన్ ఫ్యాన్స్ మధ్య.. ప్రభాస్, పవన్ ఇలా స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు సాధారణంగా జరుగుతున్నాయి. ఇవి కాకుండా రీసెంట్ గా అంటుకున్న జాడ్యం ఒకటి ఉంది. అదేమిటంటే తమిళ హీరో ఫ్యాన్స్ మరియు తెలుగు హీరో ఫ్యాన్స్ మధ్య తాజాగా సోషల్ మీడియాలో  ఒక గొడవ వైరల్ గా మారింది. వాళ్ళిద్దరు మరెవరో కాదు మహేష్ మరియు విజయ్. ఈ ఇద్దరు హీరోల అభిమానులు ట్విటర్ లో ఒకరినొకరు ద్వేషించుకొంటూ తెగ రెచ్చిపోతున్నారు.

 

మామూలుగా అయితే మహేష్ మరియు విజయ్ మధ్య మంచి సాన్నిహిత్యం సంబంధం ఉంది. ఇద్దరు ఎప్పుడూ ఒకరికి ఒకరు గౌరవించుకోవడం అందరికీ తెలిసినదే. అటువంటిది అసలే కరోనా వైరస్ గురించి జనాలందరూ భయం భయం తో ఇళ్లల్లో చస్తుంటే ట్విటర్ లో మహేష్ మరియు విజయ అభిమానుల గోల ఎక్కువ అవటంతో చాలామంది ఏంటి రా బాబు మాకు ఈ గోల, అసలు విషయం లేకుండా గొడవ పడటం ఎందుకు రా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news