ఈ దురాగ‌తానికి బాధ్యులు ఎవ‌రు?  గ‌ల్లీ వాసులా?  ఢిల్లీ పెద్ద‌లా?

-

ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ఒణికిస్తోంది. తెలంగాణ‌లో వంద కేసులు, ఏపీలో 87 కేసులు న‌మోదైన‌ట్టు తెలిసింది. ఇక‌, మ‌ర‌ణాల విష‌యానికి వ‌స్తే.. తెలంగాణ‌లో ఆరుగురు, ఏపీలో ము గ్గురు(క‌రోనా అని చెప్ప‌క‌పోయినా.. ఆ ల‌క్ష‌ణాల‌తోనే మృతి) తుదిశ్వాస విడిచారు. అయితే, ఇవి నేరు గా ఎక్క‌డి నుంచో వ‌చ్చి ఇక్క‌డ అంటించుకున్న క‌రోనా కేసులు కావు. ఢిల్లీలో గ‌త నెల మార్చిలో జ‌రిగిన ము స్లింల స‌మావేశానికి హాజ‌రైన మ‌తస్థులకు అక్క‌డికి వ‌చ్చిన విదేశీయుల నుంచి (ఇండోనేషియా, ఇరాన్‌, ఉజ్బెకిస్తాన్  వంటి దేశాలు) వ‌చ్చిన కొంద‌రు కార‌ణంగా క‌రోనా వ్యాపించింది.

నిజానికి ఇప్ప‌టి వ‌రకు తెలంగాణ‌లోకానీ, ఏపీలోకానీ సంభ‌వించిన మ‌ర‌ణాల వెనుక ఢిల్లీ ఉదంతం ఉంద నేది ప్ర‌భుత్వాలు కూడా చెబుతున్న మాట‌. కేంద్ర ప్ర‌బుత్వం కూడా ఇదే విష‌యాన్ని ధ్రువ ప‌రుస్తోంది. దీంతో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్ర‌బుత్వం ఈ మ‌త ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన వారిపై కేసులు పెట్టా ల‌ని ఆదేశించింది. అయితే, కేజ్రీ చ‌ర్య‌ను సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు దుయ్య‌బ‌డుతున్నారు. నిజానికి ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలోనే దేశంలో క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు మోగించింది. దీంతో కేంద్రం అలెర్ట్ అ యింది. అదేస‌మ‌యంలో అంద‌రిక‌న్నాముందుగానే అలెర్ట్ అయ్యారు కేజ్రీవాల్‌.

ఈ క్ర‌మంలోనే మార్చి 1నే ఢిల్లీలో ఆంక్ష‌ల‌ను అమ‌ల్లోకి తెచ్చారు. అంటే ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకోకుం డా ఐదుగురుకు మించి నిర్వ‌హించే ఏ కార్య‌క్ర‌మాన్నీ చేప‌ట్ట‌రాద‌ని నిష్క‌ర్ష‌గా ప్ర‌భుత్వం పేర్కొంది. పోలీ సుల‌కు కూడా స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది అదేస‌మ‌యంలో విదేశీయ‌ల‌పైనా దృష్టి పెట్టాల‌ని పేర్కొం ది. అయిన‌ప్ప‌టికీ.. రాజ‌ధానికి కూత వేటు దూరంలో ఉన్న హ‌జ‌ర‌త్ నిజాముద్దీన్ ప్రాంతంలో మ‌ర్క‌జ్‌(మ‌త ప‌ర‌మైన స‌మావేశం) నిర్వ‌హించారు. దీనికి వేల సంఖ్య‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ముస్లింలు హాజ‌ర‌య్యారు. అదేస‌మ‌యంలో దీనికి వివిధ దేశాల నుంచి కూడా మ‌త‌పెద్ద‌లు వ‌చ్చారు.

ఫ‌లితంగా క‌రోనా వ్యాప్తి చెందింది. అయితే, ఇప్పుడు కేజ్రీవాల్ స‌హా కేంద్ర ప్ర‌భుత్వం చుట్టూ అనేక ప్ర‌శ్న లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. కేవ‌లం నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు చేయాల‌ని కేజ్రీవాల్ ఎలా ఆదేశి స్తార‌నేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌. అంతేకాదు,మార్చి 1 నుంచే నిషేధాజ్ఞ‌లు ఉన్న‌ప్పుడు మ‌ర్క‌జ్ నిర్వ‌హ‌ణ‌కు పోలీసులు ఎలా అనుమ‌తి ఇచ్చారు. ఒక‌వేళ అనుమ‌తి లేకుండా నిర్వ‌హిస్తే.. సంబంధిత అధికారులు ఎలా చూస్తూ ఊరుకున్నారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. డిల్లీ స‌మస్య నేడు గ‌ల్లీకి వ్యాపించి ప్ర‌జ‌ల ప్రాణాలు అర‌చేతుల్లోకి జారిపోయిన నేప‌థ్యంలో కేజ్రీ ప్ర‌భుత్వ‌మైనా.. మోడీ ప్ర‌భుత్వ‌మైనా చేతులు దులుపుకొని నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు చేయ‌డాన్ని స‌మాజం ఆక్షేపిస్తోంది. ఏదేమైనా బాధ్య‌త విస్మ‌రించిన ఈ ప్ర‌భుత్వాల‌పై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news