ఏపీకి రాజ‌ధాని ఏదో క్లారిటీ వచ్చేసిందా?

-

ఏపీ(AP)కి రాజ‌ధాని ఏది ?  కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంపై తేల్చేసిందా ? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాలను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. చంద్ర‌బాబు హ‌యాంలో అమ‌రావ‌తిని రాజ‌ధానిగా పేర్కొంటూ.. ఇక్క‌డ కొన్ని నిర్మాణాలు చేశారు. అయితే.. ఏ రాజ‌ధానికైనా స‌రిహ‌ద్దులను నిర్ణ‌యించాలి. మ‌రి ఎంతో మేధావిగా చెప్పుకొనే చంద్ర‌బాబు.. ఈ విష‌యంలో ఎక్క‌డో త‌ప్పులో కాలేశారు. అమ‌రావ‌తి అంటే..కేవ‌లం సీఆర్డీఏ అంటూ.. చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో శాశ్వ‌త నిర్మాణాలు.. కూడా చేప‌ట్ట‌లేదు. హైకోర్టు స‌చివాల‌యం వంటి ప‌లు నిర్మాణాలు.. తాత్కాలిక ప్రాతిప‌దిక‌న చేప‌ట్టారు. దీనినే రాజ‌ధానిగా పేర్కొన్నారు. ఐదేళ్ల పాల‌న‌లో ఆయ‌న రాజ‌ధాని పేరుతో గ్రాఫిక్స్ మాయాజాలం చూపించారు.

ఏపీ/AP
ఏపీ/AP

మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే.. శాశ్వ‌త నిర్మాణాలు చేప‌డ‌తామ‌నే ఉద్దేశంతో దీనిని ఎన్నిక‌ల‌కు ముందు వాయిస్‌గా చేసుకున్నారు. అయితే.. అధికారం ద‌క్క‌లేదు. ఈలోగా అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ పూర్తిగా రాజ‌ధానిపై యూట‌ర్న్ తీసుకున్నారు. మూడు రాజ‌ధానులు ప్ర‌క‌టించారు. అయితే..దీనిపై రాజ‌ధాని రైతులు న్యాయ‌పోరాటం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు కూడా మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్‌ను వ్య‌తిరేకించ‌లేదు. కేవ‌లం రైతులకు న్యాయం చేయాల‌నే విష‌యాన్ని మాత్ర‌మే ప‌రిశీలిస్తోంది. అయితే ఇప్పుడు ఇదే విష‌యం అమ‌రావ‌తికి శాపంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా ఒకరు ఆర్టీఐ ద్వారా ఏపీకి రాజ‌ధాని ఏది ? అని ప్ర‌శ్నించిన‌ప్పుడు కేంద్ర హోం శాఖ‌.. మూడు రాజ‌ధానులనే పేర్కొంటూ స‌మాధానం ఇచ్చింది. మూడు రాజ‌ధానుల‌నే విష‌యం దీంతో స్ప‌ష్ట‌మైంది. అయితే.. దీనికి కూడా ప్రాతిప‌దిక లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ వివాదం ప్ర‌స్తుతం హైకోర్టులో ఉంది. అయిన‌ప్ప‌టికీ.. రాజ‌ధాని విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌రావ‌తి అని కాకుండా.. మూడుకు మొగ్గు చూప‌డం.. ఏకంగా స‌మాచార హ‌క్కు ద్వారా అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం వంటివి ఏకంగా.. రాజ‌ధాని విష‌యంలో కేంద్రం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింద‌నే సంకేతాలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news