మీకు మందు తాగే అలవాటు ఉందా ? ఇంతకంటే గుడ్ న్యూస్ ఉండదు చూడండి !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక మందుబాబులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బెల్ట్ షాపులు రద్దు చేయడంతోపాటు మద్యాన్ని ప్రభుత్వం నడిపించడం తో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత టైం నుండి ఇంత టైం వరకే అంటూ జగన్ గవర్నమెంట్ రూల్ తీసుకు రావడంతో చాలామంది మందుబాబులు లైన్ లో నిలబడి మందు తీసుకోవడం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఈరోజు తాగిన బ్రాండ్ తర్వాత రోజు ఉండకపోవడంతో కూడా అనేక కష్టాలు పడుతున్నారు. ఎన్ని కష్టాలు పడుతున్న మందుబాబులకు ఒక గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో ఏపీ మీడియా వర్గాల్లో వైరల్ అవుతుంది. Image result for deinkers

అదేమిటంటే ప్రస్తుత ప్రపంచంలో వస్తువులు కొనుగోలు అమ్మకాలు మార్కెట్ ఎక్కువగా ఆన్ లైన్ లో జరుగుతోంది. దీంతో ఎటువంటి వస్తువు కావాలన్నా ఆన్ లైన్ లో బుక్ చేస్తే క్షణాల్లో ఇంటికి వచ్చేస్తుంది. తినే తిండి నుండి వేసుకునే బట్టలు వరకు అంతా ఆన్ లైన్ లో వ్యాపారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో ఆన్ లైన్ లో ఫారెన్ లిక్కర్ అమ్మకాలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

 

రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆన్ లైన్ అమ్మకాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆన్ లైన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమ్మకాలు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మందుబాబులకు ఇది అతి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పటివరకు మందు కోసం క్యూ లో నిలబడినవారందరు కూడా ఇకపై మందు కొనాలంటే ఆన్ లైన్ లోనే కొనుగోలు చేయవచ్చు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news