మోహన్ vs జగన్ మోహన్ .. కొత్త కలహం మొదలవుతుందా ?

-

కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు కి మంచి పేరు ఉంది. చిన్న స్థాయి నుండి హీరో దాకా దాదాపు అయిదు వందల సినిమాల్లో నటించారు. హీరోగా ఎదిగిన మోహన్ బాబు నిర్మాతగా కూడా సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా ఉంటూ మరోపక్క విద్యాసంస్థలను నెలకొల్పి అందరికంటే భిన్నంగా తనదైన ముద్ర వేసుకున్నారు. చాలా రకాల సక్సెస్ అనుభవించిన మోహన్ బాబు పొలిటికల్ రంగంలో మాత్రం పెద్దగా రాణించలేకపోయారు. ఎన్టీఆర్ టిడిపి పెట్టిన సందర్భంలో ఇండస్ట్రీ నుండి మొట్టమొదటి నటుడుగా ఎన్టీఆర్ ని గౌరవిస్తూ టిడిపిలో చేరడం జరిగింది.Mohan Babu Joins Ysrcp- Telugu Political Breaking News - Andhra ...అయినా ఆ తర్వాత చంద్రబాబు సైడ్ తన రూటు మార్చారు మోహన్ బాబు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల చంద్రబాబుతో విభేదాలు తలెత్తి తెలుగుదేశం పార్టీని విడిపోయి, రాజకీయాలకు దూరంగా ఉంటూ పూర్తిగా సినిమా రంగానికి అంకితమయ్యారు. యధావిధిగా సినిమాలు చేస్తూ మధ్యలో ఒక్కసారి బిజెపికి మద్దతు తెలిపారు మోహన్ బాబు. కానీ గత సార్వత్రిక ఎన్నికల టైంలో డైరెక్టుగా వైసీపీ పార్టీలో చేరి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు. ఆ టైంలో మోహన్ బాబు వైసిపి పార్టీ తరఫున చాలా కష్టపడుతూ ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. కచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేస్తూ ప్రజలను మరియు వైసీపీ క్యాడర్ ని ప్రభావితం చేసే విధంగా చాలాచోట్ల మోహన్ బాబు ప్రసంగించడం జరిగింది.

 

అందరూ అనుకున్నట్టే జగన్ ముఖ్యమంత్రి అయిన సంగతి అందరికీ తెలిసినదే. దీంతో పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో వైసీపీ పార్టీ నుండి రాజ్యసభ సీటు జగన్ ఇస్తారని మోహన్ బాబు భావించారట. కానీ జగన్ తీసుకున్న నిర్ణయాలు మోహన్ బాబు కి షాక్ కి గురి చేశాయట. 4 రాజ్యసభ సీట్లలో కచ్చితంగా తనకి జగన్ ఒకటి ఇస్తారని భావించిన ఏ దశలోనూ మోహన్ బాబు పేరు రాజ్యసభ సీట్ల విషయంలో ప్రస్తావించలేదు. దీంతో మోహన్ బాబు కొత్త కలహం తో జగన్ తో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా విద్యాసంస్థల కి ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వం నుండి రావలసిన ఫీజుల చెల్లింపు బాణం ద్వారా జగన్ ప్రభుత్వం తో తాడోపేడో తేల్చుకోవడానికి మోహన్ బాబు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఫీజుల విషయం తర్వాత మెల్లగా ప్రజా సమస్యల విషయం లేవనెత్తి జగన్ తన పట్ల వ్యవహరించిన తీరును ఎండగట్టడానికి మోహన్ బాబు రెడీ అవుతున్నారట. మరి మోహన్ బాబు ఆ విధంగా వ్యవహరిస్తే, జగన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news