ఆ ఇద్ద‌రు మంత్రులతో జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పులు..

-

ఏపీలో ఇద్దరు మంత్రులు కొంత దూకుడు ప్రద‌ర్శిస్తుండ‌డంతో ప్రభుత్వానికి త‌ల‌నొప్పులు వస్తున్నా య‌ని సీనియ‌ర్ మంత్రులు చెవులు కొరుక్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు మంత్రుల వ్యవ‌హార శైలిపై పార్టీలోనూ అంత‌ర్గతంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఇరిగేష‌న్ మంత్రిగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌.. ముఖ్య‌మంత్రి జ‌గ న్‌కు అత్యంత స‌న్నిహితుడు. జ‌గ‌న్ వ్యూహాల‌ను తూ.చ‌. త‌ప్పకుండా అమ‌లు చేయ‌డంలోనూ, ఆయ‌న వాయిస్‌ను బ‌లంగా వినిపించ‌డంలోనూ అనిల్ దూకుడు గానే ఉంటున్నారు. ప్రతిప‌క్షంపై మాట‌ల తూటాలు పేల్చ‌డంలో, కౌంట‌ర్లు ఇవ్వడంలోనూ అనిల్‌ది ప్ర‌త్యేక స్టైల్‌.

అయితే, తాజాగా ఆయ‌న చేసిన ఓ వ్యాఖ్య.,. పార్టీ శ్రేణుల్లో విస్మ‌యానికి గురిచేసింది. రాష్ట్రంలో క‌నీసం 30 ఏళ్ల పాటు అధికారాన్ని త‌న వ‌ద్దే ఉంచుకుంటాన‌ని జ‌గ‌న్ అనేక స‌భ‌ల్లోనూ చెప్పారు. అయితే, తాజాగా అనిల్ మాత్రం మేం 20 ఏళ్లు అధికారంలో ఉంటాం.. అంటూ కృష్ణాజిల్లాలో పులిచింత‌ల ప్రాజెక్టు పూజా కార్యక్రమంలో ప్రక‌టించి అంద‌రినీ విస్మయానికి గురి చేశారు. అంతేగాక ఆయ‌న శాఖ‌తో సంబంధంలేని విష‌యాల్లోనూ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రక‌ట‌న‌లు చేస్తుండ‌టం కూడా మిగిలిన మంత్రుల‌కు, ఉన్నతాధికారుల‌కు ఇబ్బందిగా మారింది.

ఇక‌, మ‌రో మంత్రి.. అవంతి శ్రీనివాస్ వ్య‌వ‌హారంపై కూడా పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌ల కాలంలో విప‌క్షంపై విరుచుకుప‌డుతున్న ఆయ‌న  జ‌గ‌న్ దృష్టిలో ప‌డాల‌నే ఆతృత‌లో నేరుగా మాజీ సీఎం చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. దీంతో ప‌లు వివాదాస్పద వ్యాఖ్యల‌తో వార్తల్లో నిలిచారు. వైఎస్ ఆర్ వాహ‌న మిత్ర కార్యక్రమంలో మంత్రి అవంతి చేసిన వ్యాఖ్య‌లు ప్రభుత్వాన్ని ఇరుకున ప‌డేశాయి.

“సీఎం జ‌గ‌న్ ఫొటోలు.. మీ ఆటోల‌కు వెన‌కాల అంటించుకోండి.. పోలీసులు కానీ, ఆర్టీఏ డిపార్ట్‌మెంట్ కానీ మీకు కేసులు రాయ‌దు, వేధింపులు కూడా ఉండ‌వు.“ అని అవంతి కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల‌పై ప్ రతిప‌క్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డాయి. ఇలా ఇద్ద‌రు మంత్రులు త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో ప్ర‌భుత్వాన్ని ఇరుక‌న ప‌డేలా వ్య‌వ‌హ‌రించ‌డంపై సీనియ‌ర్ మంత్రులు ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news