హరీష్ కి కీలక బాధ్యతలు…!

-

టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు కి ఎంత ప్రాధాన్యత దక్కిందో ఆయనకు ప్రభుత్వంలో కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత దక్కుతుంది. ఆయన సామర్ధ్యాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కెసిఆర్… తొలి ప్రభుత్వంలో రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే జలవనరుల శాఖను అప్పగించారు. ఆ శాఖలో హరీష్ ఎన్నో విజయాలు సాధించారు. మిషన్ భగీరధ సహా కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో హరీష్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.

దాదాపు కీలక ప్రాజెక్ట్ లు అన్నీ కీలక దశలో ఉన్నాయి అంటే అది హరీష్ చలువే. ఇక ఇప్పుడు హరీష్ కి ఆర్ధిక శాఖ అప్పగించారు కెసిఆర్. ఇటీవల ఆయన తన తొలి బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. బడ్జెట్ పై విమర్శలు లేకుండా ప్రసంగం నుంచి కేటాయింపుల వరకు అన్నీ జాగ్రత్త పడ్డారు. ఇక ఇదిలా ఉంటే ఆయనకు తాజాగా మరో పదవి దక్కింది. మంత్రులెవరికీ కేటాయించని సాగునీటి పారుదల, సాధారణ పరిపాలన వ్యవహారాలు,

శాంతి భద్రతలకు సంబంధించి సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే బాధ్యతను ఆయనకు ఇచ్చారు. ఇక మరో మంత్రి కేటిఆర్ కి కూడా కీలక బాధ్యతలు ఇచ్చారు. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు మైనింగ్, సమాచారశాఖలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే బాధ్యతను అప్పగించడం విశేషం. ఈ శాఖలు ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దనే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news