దేశ రాజధాని ఢిల్లీలో 2012వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో జరిగిన నిర్భయ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ ఘటన గురించి ప్రపంచ దేశాలు మొత్తం భారత్ అంటే భయపడిపోయి చాలా వరకు తమ దేశాలకు చెందిన ఆడవాళ్లను భారత్ దేశానికి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశాయి. అత్యంత క్రూరంగా నరరూప రాక్షసులు మాదిరిగా నిర్భయన్ని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. దీంతో అప్పట్లో పార్లమెంటులో ఈ విషయంపై పెద్ద చర్చ జరగగా ఆఖరికి దేశంలో ఎటువంటి ఆడపిల్లకు ఇటువంటి దౌర్భాగ్యం పడకూడదని నిర్భయ చట్టం తీసుకు వచ్చారు. అయినా గాని సమాజంలో ఇప్పటివరకు మార్పు రాలేదు. ఈ తరుణంలో కేసులో నిందితులుగా ఉన్న నలుగురు ఉరిశిక్ష పడ్డ గాని, న్యాయ స్థానాలను అడ్డంపెట్టుకుని దాదాపు ఎనిమిది సంవత్సరాలు బ్రతుకుతూ జీవితాన్ని నెట్టుకురావడంతో చాలామంది ప్రముఖులు మరియు సామాన్య ప్రజలు దేశంలో ఉన్న చట్టాల పై విరుచుకుపడ్డారు.
ఇటువంటి నేపథ్యంలో చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల నిర్భయ నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తన కూతురు కోసం న్యాయస్థానం దగ్గర ఎంతగానో పోరాడిన నిర్భయ తల్లి ప్రస్తుతం ఎంతగానో సంతోషించింది. మరో పక్క దేశంలో నిర్భయ కేసులో ఉరిశిక్ష పడినా గాని చాలామంది సంతోషించడం లేదు. పూర్తి విషయంలోకి వెళితే, దేశంలో ఎంతోమంది రేపిస్ట్ లు దొరకటం జరిగింది వాళ్లను జైల్లో పెట్టి పోషిస్తున్నారు. వాళ్లకి కూడా వీళ్లతో పాటు ఉరిశిక్ష వేయాల్సింది అంటున్నారు ప్రజలు.