ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాజధానిని తాము తరలించడం లేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని జెఎసి పిల్ వేసింది. దీనిపై శుక్రవారం కోర్ట్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలను వింది రాష్ట్ర హైకోర్ట్ ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున కోర్ట్ కి హాజరైన అడ్వకేట్ జనరల్ కీలక వ్యాఖ్యలు చేసారు.
రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు ఆమోదం కాకుండా తరలింపు ప్రక్రియను చేపట్టబోమని హైకోర్టుకు తెలిపారు. రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు సెలెక్ట్ కమిటి లో ఉన్నాయని అవి ఆమోదం పొందే వరకు తాము రాజధాని తరలింపు చేపట్టేది లేదని స్పష్టం చేసారు. దీంతో ఇదే అంశంపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వ తరుపు న్యాయవాదిని ఆదేశించింది.
ద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది కోర్ట్. రాజధాని తరలింపు ప్రక్రియ ఏమైనా మొదలైతే కోర్ట్ దృష్టికి తీసుకుని రావాలని… కోర్ట్ సూచించింది. విజయసాయి రెడ్డి రాజధాని తరలిస్తామని చెప్పారని పిటీషనర్ తరుపు న్యాయవాది కోర్ట్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. దానిపై వివరణ ఇవ్వాలని కోర్ట్ ప్రభుత్వ తరుపు లాయర్ కి సూచించింది. కాగా మండలి లో బిల్ సెలెక్ట్ కమిటికి వెళ్లడంపై శాసన మండలిని రద్దు చేసిన సంగతి తెలిసిందే.