టీడీపీలో మ‌ళ్లీ ఎన్టీఆర్ డిమాండ్‌.. అభిమానులు వ‌ద‌ల‌ట్లేదుగా!

ఇప్పుడు ఏపీలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. ఏ ఎన్నికలు జ‌రిగినా వ‌రుస‌గా ఓట‌మి పాల‌వుతోంది. దీంతో టీడీపీ నాయ‌క‌త్వంపై కార్య‌క‌ర్త‌ల్లో సంక్షోభం నెల‌కొంది. దీంతో అంద‌రూ ఎన్టీఆర్‌ (NTR)ను తీసుకురావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఆయ‌నైతేనే పార్టీని న‌డిపించ‌గ‌ల‌ర‌ని ప్ర‌తి స‌భ‌లోనూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా అదే ఘ‌ట‌న మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది.

ఇక ఎంత‌మంది ఎన్ని ర‌కాలుగా డిమాండ్ చేసినా.. ఎన్టీఆర్ మాత్రం త‌న పూర్తి స‌మ‌యాన్ని సినిమాల‌కే కేటాయిస్తున్నారు. అంతే గానీ ఎక్క‌డా రాజ‌కీయాల ప్ర‌స్తావ‌న తీసుకురావ‌ట్లేదు. కానీ నందమూరి, టీడీపీ అభిమానులు మాత్ర ఎన్టీఆర్ జ‌పం వ‌ద‌ల‌ట్లేదు.

ఇప్పుడు మ‌రోసారి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎన్టీఆర్ డిమాండ్‌ను తెరమీద‌కు తెచ్చారు. కుప్పంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ లో జెండాను ఆవిష్కరించారు టీడీపీ కార్య‌క‌ర్త‌లు. నియోజ‌క‌వ‌ర్గంలోని కుప్పం మండలం మంకల దొడ్డి పంచాయతీ మలకల పల్లిలో ఎన్టీఆర్ డిమాండ్ కు నిద‌ర్శ‌నంగా ఈ జెండాను ఆవిష్క‌రించారు అభిమానులు. దీంతో టీడీపీలో మళ్లీ క‌ల‌వ‌రం మొద‌ల‌యింది.