ఎన్టీఆర్ అస‌లైన వార‌సుడు వైఎస్ జ‌గ‌న్‌.. ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

న‌ట‌సార్వ‌భౌముడు, విశ్వ విఖ్యాత అయిన ఎన్టీఆర్ జ‌యంతి నేడు. ఈసంద‌ర్భంగా ఎంతోమంది ఆయ‌న‌కు నివాళి అర్పించారు. ఎప్ప‌టిలాగే ఈ సారి కూడా ట్యాంక్‌బండ్‌లోని ఆయ‌న ఘాట్ వ‌ద్ద నంద‌మూరి వార‌సులు నివాళులు అర్పించారు. అయితే ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ పార్వ‌తి కూడా ఆయ‌న ఘాట్ వ‌ద్ద నివాళి అర్పించింది. ఈ సంద‌ర్భంగా ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఎన్టీఆర్ అస‌లైన వార‌సుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని తేల్చి చెప్పారు నందమూరి లక్ష్మీపార్వతి. కడుపున పుట్టినంత మాత్రాన ఎన్టీఆర్ వారసులు కాద‌ని ఇన్ డైరెక్టుగా నంద‌మూరి వార‌సుల‌ను టార్గెట్ చేశారు ఆమె.

ఎన్టీఆర్ ఆశయాలు అమలు చేసే వారే ఆయ‌న సిసలైన వారసులని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను అనేక సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నార‌ని, అందుకే ఆయ‌నే అస‌లైన వార‌సుడ‌ని ఆమె వివ‌రించారు. దీంతో టీడీపీ భ‌గ్గుమంటోంది. క‌డుపున పుట్టిన వారిని కాద‌ని, వేరే వారిని ఎలా వార‌సుల‌ను చెబుతారంటూ మండిప‌డుతున్నారు. ఎన్టీఆర్ ఆశ‌యాల కోస‌మే నంద‌మూరి వార‌సులు పోరాడుతున్నారంటూ తెలుగు త‌మ్ముళ్లు స్ప‌ష్టం చేస్తున్నారు.