ఫొటో స్పీక్స్ :  ఆ నాటి  త‌వ్వ‌కాల్లో కేసీఆర్ ఎట్లున్న‌డంటే…

-

కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు ఆర‌డుగుల దూరంలో కేసీఆర్ సారూ ! నిల్చొని ఉండిన్రు.. ఈ క‌త ఇప్ప‌టిది కాదు కానీ అప్పుడెప్పుడో ఢిల్లీలో ఉన్న‌ప్పుడు తీసిన ఫొటో ఒక్క‌టి నెట్టింట తిరుగుతున్న‌ది. ఆక‌లి, క‌న్నీళ్లు ఇప్పుడు లేవు పాల‌మూరులో అని ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న అంటున్న‌డు.. నిజ‌మేనా సారూ ! ఆ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ సైద్ధాంతిక మాయా జాలం మాత్రం అలాన ఉంది అన్న‌ది కొంద‌రి ఆవేద‌న‌.


తెలంగాణ సాధ‌న‌కు ఓ పార్టీ పుట్టింది. అంత‌కుముందు కూడా కొన్ని పార్టీలు పుట్టాయి. చెన్నారెడ్డి సార‌థ్యంలో కూడా పార్టీ పుట్టి ఆగిపోయింది. కానీ తెలంగాణ‌లో ఇంటి పార్టీగా పేరు తెచ్చుకుని ద‌శ‌దిశ‌లా వ్యాప్తి చెందిన ఏకైక పార్టీ కాంగ్రెస్ కు దీటుగా ఎదుగుద‌ల సాధించిన పార్టీ  తెలంగాణ రాష్ట్ర స‌మితి. సిద్ధాంత క‌ర్త జయ శంక‌ర్ స‌ర్.. ఆయ‌నే లేకుంటే పార్టీనే లేక‌పాయె. తెలంగాణ ఉద్య‌మ దిశ‌నూ ద‌శ‌నూ నిర్దేశించిన ఓ గొప్ప మ‌హ‌నీయుని స్మ‌ర‌ణ లేదు. ఆయ‌న పేరుతో ఓ తీర్మానం లేదు. కానీ ఏటా జెండా పండుగ అంటూ సంద‌డి చేయ‌డం మాత్రం గులాబీ దండుకు ఓ అల‌వాట‌యింద‌ని విప‌క్షాలు అన్నీ గ‌గ్గోలు పెడుతున్నాయి. మ‌రి! తెలంగాణ‌లో మాఫియా ఎట్లుంది. గ‌ద్ద‌ర్ ఏం అంటున్న‌డు.. ఇవి కూడా మాట్లాడుకోవాలె.. కానీ ఇవేవీ మాట్లాడేందుకు కేసీఆర్ అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని ఓయూ జాక్ మండి ప‌డుతోంది. ఆ విధంగా ఆ రోజు కేసీఆర్ అనే నాయ‌కుడు చెప్పిన మాట‌ల‌కూ ఇప్ప‌టి చేత‌ల‌కూ, అమ‌రుల ఆశ‌యాల‌కూ ఎక్క‌డా పొంత‌న అన్న‌ది లేకుండా ఉంద‌న్న‌ది అంద‌రి ఆవేద‌న‌.

మాట్లాడితే చాలు కాంగ్రెస్ మెడ‌లు వంచి తెలంగాణ సాధించాం అని అంటారు కేసీఆర్. మ‌రి! ఆ రోజు కేసీఆర్ కేవ‌లం సంప్ర‌తింపు లతోనే తెలంగాణ సాధ్యం అన్న మాట కూడా అన్నారే ! మ‌రి ! వేటిని నమ్మాలి. ఎవ‌రిని న‌మ్మాలి? ఏదేమ‌యిన‌ప్ప‌టికీ బంగారు తెలంగాణ క‌ల సాకారం ఇంకా ఆమ‌డ దూరంలో ఉన్న నేప‌థ్యాన కేసీఆర్ సాధించాల్సిన‌వి ఎన్నో ఉన్నాయి. వాటిని సాకారం చేసుకునేందుకు ఆయ‌న చేయాల్సిన కృషి ఇంకా మిగిలే ఉంది. ఈ నేప‌థ్యంలో ఆ రోజు  కాంగ్రెస్ తో స్నేహం చేసిన కేసీఆర్ త‌రువాత కాలంలో క‌య్యానికి కాలు దువ్విన వైనం కూడా మ‌రువ కూడ‌దు. ఇప్పుడు రాష్ట్రంలో అప్పులు బాగా పేరుకుపోయా యి.. కొత్త అప్పులు పుట్ట‌డం లేదు..అయినా కూడా బంగారు తెలంగాణ అని అన‌డంలో అర్థ‌మే లేదు..అని అంటున్నారు సొంత మ‌నుషులే ! అప్పుడున్న విజన్ ఇప్పుడేమాయె !

Read more RELATED
Recommended to you

Latest news