ఆగండి ఆగండి EMI లు అప్పుడే పోస్ట్ పోన్ కాదు .!!

-

కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రపంచంలో చాలా వరకు వ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ వైరస్ వల్ల ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు చాలా వరకు డేంజర్ జోన్ లోకి పడిపోతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో చాలామంది ప్రజలు మరియు సెలబ్రిటీలు ఈఎంఐలపై ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇటువంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. How the RBI governor is appointed?దీనికి సంబంధించిన వివరాలను తాజాగా ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. ఏప్రిల్ నెల నుండి మూడు నెలల పాటు అన్ని రకాల లోన్ ల ఈఎంఐలపై బ్యాంకులకు ఇచ్చింది ఆర్.బి.ఐ. ఈ నిర్ణయంతో మూడు నెలలు ఏ సంస్థ కూడా ఈఎంఐలను కట్ చేయకూడదు. మరోవైపు రెపోరేటును 75 పాయింట్లు తగ్గించగా, రివర్స్ రెపో రేటును 90 పాయింట్లకు కుదించింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు.

 

దీంతో సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు మరియు ప్రముఖులు ఆర్బిఐ మా EMI లను పోస్ట్ పోన్ చేసింది అంటూ తెగ సంబర పడిపోతున్నారు. ఇటువంటి తరుణంలో EMI లు అప్పుడే పోస్ట్ పోన్ కాదు అంటూ మరో పక్క కొత్త వార్తలు వినబడుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే బ్యాంకులకు మారటోరియం ఆర్బిఐ ఇచ్చింది. కానీ ఈ విషయంలో మాత్రం  ఏ బ్యాంకు కి ఆ బ్యాంకు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అంటే కొత్త వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news