ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు .. సరిగ్గా అదే జరిగింది జగన్ కి !

-

వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతూనే ఉన్నాయి. అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు మరియు కొత్త చట్టాలు దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకుల చూపును ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల చూపును ఆంధ్రా వైపు తిప్పేలా చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ఆడవాళ్ళ పై జరుగుతున్న హత్యలు అత్యాచారాలు నిలువరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. Image result for jagan

ఇటువంటి సమయంలో ఆడవాళ్ళ భద్రత గురించి జగన్ తీసుకున్న నిర్ణయాలు గురించి ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా సరిగ్గా అదే జగన్ పొలిటికల్ కెరియర్ లో ప్రస్తుతం పని చేయబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విషయంలోకి వెళితే ఇటీవల జగన్ సర్కార్  దిశ యాక్ట్ ను తీసుకొచ్చింది. ఏ మహిళ అయినా హింసకు గురైనా, అత్యాచారానికి గురైన, హత్య చేయబడినా… 21 రోజుల్లోనే కేసు పూర్తి చేసి నిందితులకు శిక్షపడేలా చేయాలి అనేది ఈ చట్టం యొక్క ఉద్దేశం.

 

దీనికి కేంద్రం కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ప్రస్తుతం పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత చట్టంగా మారుతుంది. దీంతో దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఒడిశా, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు దిశ చట్టాన్ని వారి రాష్ట్రాల్లో అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఖచ్చితంగా ఈ చట్టం ఆయా రాష్ట్రాల్లో అమలు అయితే గనుక జగన్ భారతదేశంలో ఒక రాజకీయ శక్తి గల నేతగా అవతరించడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 

Read more RELATED
Recommended to you

Latest news