పాకిస్తాన్ మాజీ ఆటగాడు జహీర్ అబ్బాస్ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాట్స్ మన్ అని ప్రశంసించాడు. అయితే, టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ కంటే ఆస్ట్రేలియాకు ఆటగాడు స్టీవ్ స్మిత్ నిలకడగా ఉన్నాడని అబ్బాస్ పేర్కొన్నాడు. “అయితే, టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ కంటే స్టీవ్ స్మిత్ చాలా స్థిరంగా ఉన్నాడు. అతను ఆడే దాదాపు ప్రతి సిరీస్‌లోనూ అతను మంచి స్కోర్ చేస్తాడు.
డేవిడ్ వార్నర్ కూడా బాగా రాణిస్తున్నాడని అన్నాడు. మూడు ఫార్మాట్లలో కోహ్లీ మరింత స్థిరంగా ఉంటాడని, ఇది అతన్ని క్రికెట్ లో స్థాయిని పెంచిందన్నాడు. “కానీ నేను చెప్పినట్లుగా, ఒక బ్యాట్స్ మాన్ అన్ని ఫార్మాట్లలో ప్రదర్శన ఇవ్వాలి మరియు ఆ కోణంలో, కోహ్లీ ఇతర ఫార్మాట్స్ లో కూడా మరింత స్థిరంగా ఆడతాడు అని అభినందించాడు. “మీరు ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా ఉండాలి అంటే, మీరు అన్ని ఫార్మాట్లలో స్థిరంగా ఆడాలని అన్నాడు.
కొన్నేళ్లుగా కోహ్లీ సాధించిన వాటిని ఒక్కసారి చూడండని… ఈ సమయంలో, కోహ్లీతో పాటు వచ్చిన వాళ్ళు చాలా మంది క్రికెట్ లో లేరని అన్నాడు. ఆట చాలా అభివృద్ధి చెందిందని… ఇది వేర్వేరు యుగాలలో కూడా విభిన్నంగా ఉందని అన్నాడు. కరోనా ప్రభావం తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్ళు టీం ఇండియా తో క్రికెట్ ఆడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఆటగాళ్ళు పొగడ్తల వర్షం కురిపించారు మన వాళ్ళ మీద.