చంద్రబాబు వద్దకు ఇద్దరు ఎమ్మెల్యేల పంచాయితీ

-

వ‌రుస క‌ష్టాల‌తో విల‌విల్లాడుతోన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు ఇప్పుడు ఇద్ద‌రు ఎమ్మెల్యేల పంచాయితీ చేరింద‌ట‌. తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎంతో బలం ఉంది. రాజకీయంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ గతంలో చక్రం తిప్పింది. 2014  ఎన్నికలలో 90 శాతం స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ఇక వ్యతిరేకత ఉండటంతో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలను మాత్రమే సాధించింది. పెద్దాపురం నుంచి మాజీ మంత్రి చినరాజప్ప, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి, రాజమండ్రి టౌన్ నుంచి ఆదిరెడ్డి అప్పారావు కోడలు, ఆదిరెడ్డి భవాని విజయం సాధించారు. ఇక మండ‌పేట‌లో వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు వ‌రుస‌గా మూడో గెలుపుతో హ్యాట్రిక్ కొట్టారు.

అయితే ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఒక కష్టం వచ్చి పడింది. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఓడిన అభ్యర్ధులే ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారు. ఈ సమస్య గురించి చంద్రబాబు వద్దకు ఇద్దరూ తీసుకు వెళ్ళారు. కనీసం ప్రోటో కాల్ కూడా పాటించడం లేదని, తమకు ఏ మాత్రం ఓడిన అభ్యర్ధులు విలువ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేసారట ఇద్దరు. బుచ్చయ్య చౌదరి అయితే… ఈ పరిస్థితి ఏంటి…? తాను సీనియర్ ఎమ్మెల్యేని అని… అయినా తనను ఈ విధంగా ఏ మాత్రం గౌరవం లేకుండా ఇబ్బంది పెడుతున్నారని, కనీస గౌరవం లేనప్పుడు తాను ఏం చెయ్యాలని చంద్రబాబు వద్ద వాపోయారట.

ఇక ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ విషయాన్ని సీరియస్ గా తన భావ అయిన రామ్మోహన్ నాయుడు వద్ద చెప్పారట. ఇలా అయితే ఎలా అని… ఎంపీ మార్గాని భరత్ నుంచి సహకారం ఉన్నా, తమకు స్థానిక ఓడిపోయిన అభ్యర్ధి నుంచి ఏ మాత్రం సహకారం లేదని చెప్పారట. దీనిని కాస్త సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని భావిస్తున్నారట. ఈ యేడాది ఎన్నిక‌ల్లో ఆదిరెడ్డి భ‌వానీ వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య‌ప్ర‌కాశ్‌రావుపై విజ‌యం సాధించారు.

ఆ త‌ర్వాత జ‌గ‌న్ ఆయ‌న్ను త‌ప్పించి అక్క‌డ శికాకొళ‌పు శివ‌రామ సుబ్ర‌హ్మ‌ణ్యంకు బాధ్య‌త‌లు ఇచ్చారు. ఇప్పుడు అక్క‌డ అంతా ఆయ‌న ఆధిప‌త్య‌మే న‌డుస్తోంది. ఇక రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస‌గా బుచ్చయ్య‌పై రెండుసార్లు ఓడిపోయిన ఆకుల వీర్రాజు ఇప్పుడు బుచ్చ‌య్య మాట ఎంత‌మాత్రం నెగ్గ‌నీయ‌డం లేదు. అందుకే ఈ ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర‌మైన అస‌హ‌నం ఏర్ప‌డింది.

Read more RELATED
Recommended to you

Latest news