ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ మళ్లీ టీవీ తెరపైకి పునరాగమనం చేయనున్నారు. ఈ టీవీలో ప్రసారమైన ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు పొందారు. చాలా కాలం తర్వాత టీవీలో వ్యాఖ్యతగా కనిపించేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారట. అయితే ఎక్కడా తన ప్రాబల్యానికి ఛానల్‌లో అడ్డు ఉండదనుకున్న ఆయన మహా టీవీ ఛానల్ నిర్వహణ బాధ్యతలను కూడా తానే స్వీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఛానల్ పూర్తిగా ఆయన యజమాయిషిలోనే నడుస్తుందని తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మాజీ సలహాదారుగా పనిచేసిన పరకాల ఎన్నికల ముందు నుంచే టీడీపీ అధినేత చంద్రబాబుతో దూరంగా ఉంటూ వస్తున్నారు. వీరిద్దరికి చెడిందన్న విషయం బహిరంగంగా చర్చలు సాగినా.. ఎందుకు చెడిందనే విషయంపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేకపోవడం గమనార్హం. వాస్తవానికి పరకాల భార్య నిర్మలా సీతారామన్‌కు మోదీ మంత్రి పదవి ఇవ్వడంతో బాబు ఆమెతో అవసరాల నేపథ్యంలో పరకాలకు కీలకమైన పదవి ఇచ్చారు.
ఆ తర్వాత బాబు ఎన్డీయేకు దూరం కావడంతో బాబుకు పరకాల కూడా దూరమయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక ఇప్పుడు ఆకస్మాత్తుగా పరకాల ఛానల్ నిర్వహణ బాధ్యతతో పాటు వ్యాఖ్యతగా మారాలని అనుకోవడం వెనుక కారణాలేంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు మీడియా ప్రతినిధిగా..ఛానల్ నిర్వాహాకుడిగా ఎవరి వైపు నిలబడబోతున్నారనే దానిపై పెద్ద చర్చే సాగుతోంది.
ఇంత వరకు బాగానే ఉన్నా..ఆది నుంచి నష్టాలను మూటగట్టుకుంటున్న మహాన్యూస్‌ను తీసుకుంటడంపై మీడియా వర్గాల్లోనూ కొంత విస్మయం వ్యక్తమవుతోందంట. గతంలో కొన్నాళ్లు సుజానా చౌదరి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాలకు చూసుకుంటే ఆర్థికంగా పెనుభారంగా భావించిందని వదిలేశారట. తలా కొన్నాళ్లుగా అన్నట్లుగా ఆ ఛానల్ నిర్వహణ కొనసాగుతూ వస్తోంది.
ఇప్పుడు మహాటీవీ తెరపైకి పరకాల ప్రభాకర్ వచ్చారు. మరీ ప్రభాకర్ అయినా మహా టీవీ దశ దిశను మార్చేస్తారో లేక చేతులెత్తేస్తారో కొద్దిరోజులు ఆగితే గాని తెలియదు. అయితే మహాటీవీని కొత్తగా లాంచ్ చేసేందుకు సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ తో కలిసి న్యూ మ్యూజిక్ కంపోజిషన్స్ చేపట్టడం గమనార్హం.