బిజెపితో పొత్తు నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకునే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. జనసేన, బిజెపి పొత్తు పెట్టుకుని నెల రోజులు అయిందనుకుంట ఈ నెల రోజుల్లో రెండు పార్టీల మధ్య వచ్చిన విభేదాలు పైకి కనపడకపోయినా సరే ఎక్కువగానే ఉన్నాయి అనేది రాజకీయ పరిశీలకుల మాట. సోషల్ మీడియాలో జనసేన, బిజెపి కార్యకర్తలు ఒకరిపై ఒకరు దూషణలకు కూడా దిగినట్టు వార్తలు వచ్చాయి.
జనసేన పార్టీ రాజకీయ ప్రయాణంలో బిజెపితో పొత్తు అనేది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. వామపక్షాలకు ఒక్క మాట కూడా చెప్పకుండా పవన్ కళ్యాణ్ ముందుకి వెళ్ళారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు అమరావతి ఉద్యమం విషయంలో పవన్ కళ్యాణ్ దూకుడుగా వెళ్తున్నారు. రాజకీయంగా అమరావతి ఉద్యమం ఆయనకు ప్లస్ మైనస్ అనేది పక్కన పెడితే రైతుల పక్షాన నేను ఉంటాను అని మాత్రం ప్రకటించారు పవన్.
అది పక్కన పెడితే ఇప్పుడు ఆయనకు ఈ విషయంలో బిజెపి నుంచి మద్దతు లేదు అనేది అర్ధమవుతుంది. పవన్ ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పారు కూడా. రాష్ట్ర పార్టీ ఒకటి మాట్లాడితే కేంద్ర పార్టీ ఒకటి మాట్లాడుతుందని, దీని వలన భిన్న అర్ధాలు వస్తాయని పవన్ అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే కేంద్రం గాని, బిజెపి గాని అమరావతి విషయంలో ఏ మద్దతు ఇవ్వడం లేదు గాని పరోక్షంగా వైసీపీకి సహకరిస్తున్నాయి అనే అభిప్రాయంలో పవన్ ఉన్నారు. దీనితో ఆయన తెగ తెంపులు చేసుకోవడానికి కూడా సిద్దమైనట్టు సమాచారం.