ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి అమరావతిని రాజధానిగా కొనసాగించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అడుగు అడుగునా అడ్డం పడుతూ రైతుల పోరాటాన్ని అడ్డుకుంటున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమరావతి రైతుల కోసం పూర్తి స్థాయిలో,
పోరాటం చెయ్యాలని చూస్తున్నారు. తాజాగా ఆయన అమరావతిలో రైతుల ఆందోళనలపై కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాజధాని బాధ్యత కేంద్రంపై ఉందన్న ఆయన, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన రాజధాని విషయంలో తదుపరి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ సూచించారు.
ఇక ఇదిలా ఉంటే అమరావతి కోసం పోరాటం పూర్తి స్థాయిలో చెయ్యాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఇసుక సమస్య తరహాలో లాంగ్ మార్చ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ సహకారంతో పవన్ కళ్యాణ్ ఈ మార్చ్ చేయడానికి సిద్దమవుతున్నారని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తే ఉద్యమం యువతలోకి వెళ్ళే అవకాశం ఉందని చంద్రబాబు భావించి పవన్ ని అడిగినట్టు సమాచారం.