బురదతో నిండిన పవన్‌ బుర్ర.. పేదలకు మేలు జరిగితే ఓర్వలేనితనం

-

ఏపీలో జగనన్న లేఅవుట్‌లు శరవేగంగా నిర్మాణమవుతున్నాయ్‌. ఇవి పూర్తయితే అనేకమంది పేదలు సొంత ఇంట్లో దర్జాగా బ్రతుకుతారు.అంటే పేదలకు సొంత గూడు ఉంటే వారి కళ్ళలో ఉండే ఆనందమే వేరు. అలాంటి ఆనందాన్ని వాళ్ళకు పంచడం కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇక్కడే ప్రతిపక్షానికి ఓర్వలేనితనం వస్తోంది అంటున్నారు అధికార వైసీపీ నాయకులు. పేదలకు మంచి జరిగితే ఓర్చుకోలేని తత్వమున్నచంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వాటిని అడ్డుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎక్కడ మంచి జరిగితే అక్కడ వాలిపోయి ఆ కార్యక్రమాన్ని చెడగొట్టడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు మండిపడుతున్నారు.

ఇటీవల వారం రోజుల పాటు రాష్ర్టంలోని అనేక ప్రాంతాల్లో అపారంగా వానలు కురిశాయి. అటు ఎగువప్రాంతాల్లో పడిన అధిక వర్షాల కారణంగా చుక్క నీటికి నోచుకోని పిల్లకాలువలు సైతం పరవ్ళు తొక్కాయి. వట్టిపోయి బావురుమంటున్న బావులుసైతం నీళ్ళతో తొణికిసలాడాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో జనాలతో పాటు మూగజీవాలు సైతం మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు వందల సంఖ్యలో వాహనాలు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితులు చూశాం. అయితే సినిమా రిలీజ్‌లు,ఆడియో పంక్షన్‌లతో బిజీగా ఉండే పవన్‌కళ్యాణ్‌ కళ్ళకు ఇవేమీ కనపడినట్టులేవని వైసీపీ నేతలు సెటైర్‌లు వేస్తున్నారు. చూడటానికి కళ్ళు కూడా లేవన్నట్లుగా ఆయన వ్యవహరం తయారైందని అంటున్నారు. వానలకు లంక గ్రామాలే కాదు మహానగరాలు సైతం మునిగాయి. అలాంటిది ఇప్పుడిప్పుడే పునాదులు దాటి గోడల వరకు చేరిన జగనన్న కాలనీల్లోకి నీళ్ళు చేరడం పెద్ద విషయమేమీకాదని, దీనిని భూతద్దంతో చూస్తూ పెద్ద సమస్యగా మాట్లాడటం బాగోలేదని పవన్‌ తీరును తప్పుబడుతున్నారు.

ఒకసారి కాలనీ ఏర్పడ్డాక ఒక్కొక్కటిగా వసతులు సమకూరుతాయి. రోడ్లను ఎత్తు చేయడం, సైడు కాలువలు నిర్మించడం, నీటి పారుదలకు అనువుగా పరిస్థితులు ఏర్పాటు చేయడం వంటివి చేస్తారు. అయితే ఇంకా వసతులు సమకూరని జగనన్న లేఅవుట్‌లలో నీరు నిలవడం పెద్దగా ఆశ్చర్యానికి లోనుకావలసిన విషయమే కాదంటున్నారు వైసీపీ నేతలు. అయితే ఇవేమీ పట్టిని దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ ప్రభుత్వంపై బురదచల్లడమేపనిగా పెట్టుకున్నాడని ఆగ్రహం చెందుతున్నారు. తన ఫామ్‌హౌస్‌లో కూడానీరు నిలబడి గుంతలు ఏర్పడిన వాస్తవాలను కూడా మరిచి జగనన్న కాలనీలను టార్గెట్‌ చేసుకుని విమర్శలు చేస్తున్నాడని ప్యాకేజీ స్టార్‌పై ఆగ్రహావేశాలు వెల్లగక్కుతున్నారు. ప్రజలు సంతోషంగా ఇళ్లు కట్టుకుంటున్న వేళ వర్షం వల్ల కాస్త అంతరాయం ఏర్పడిన మాట వాస్తవం. ఈ టైమ్‌లో తన గ్యాంగ్‌తో అక్కడికి చేరుకుని వెటకారంతో మాట్లాడటం వపన్‌కే చెల్లిందని, అసలు బురద ఉన్నది జగనన్న లేఅవుట్‌లలో కాదు దత్తతండ్రి, దత్తపుత్రుడి బుర్రలో అనే వాస్తవాన్ని వాళ్ళు గుర్తెరగాలి అని అటు లబ్దిదారులు కూడా విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news