‘వైఎస్‌ఆర్, చంద్రబాబులు ఎస్‌ఈజెడ్‌ల పేరిట వేల ఎకరాల భూములను రైతులనుంచి లాక్కున్నారు. ఎవరికీ ఉపాధి చూపకుండా అయినవారికి అక్రమపద్ధతుల్లో ఆ భూములను అర్పితం చేస్తున్నారు. ఇజ్రాయిల్, సింగపూర్ వంటి దేశాల్లో ఎకరం భూమి తీసుకుంటే వెయ్యిమందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఇక్కడ ఆ తరహా అభివృద్ధి ఎక్కడ ఉంది. రైతులపక్షాన జనసేన ఉండి వారిని కాపాడే లక్ష్యంతోనే పనిచేస్తుంది. వేల కోట్ల రూపాయలను అప్పనంగా దోచేసి ఈడీ కేసుల్లో చిక్కుకున్న టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వైఖరిపై లోకేశ్‌బాబు ఏం సమాధానం చెబుతారు. ప్రధాని మోదీ అంటే చంద్రబాబుకు, జగన్‌కు భయం. ఉత్తరాధి నేతల అహంకారాన్ని వీరు వ్యతిరేకించలేక పోతున్నారు. చంద్రన్నకి సెలవిద్దాం.. జగనన్నని పక్కన పెడదాం. జనసేన ప్రభుత్వం స్థాపిద్దాం’ అని పవన్ పిలుపునిచ్చారు.
బ్రాహ్మణులు లేకపోతే స్వాతంత్య్రం వచ్చేది కాదు
వాళ్లను అవహేళన చేస్తే ఊరుకోం!
‘బీజేపీ వాళ్లు అవకాశవాద రాజకీయ నాయకులు. నిజంగా రామమందిరం కట్టాలంటే.. కట్టండి! కడతాం.. కడతాం అని ఎందుకు భావోద్వేగాలు రెచ్చగొట్టి, వైషమ్యాలు పెంచుతున్నారు?’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లకు హిందూ భావనే ఉంటే రాష్ట్రాన్ని ఎందుకు రెండుగా విడగొడతారని పవన్ నిలదీశారు. బ్రాహ్మణులు లేకపోతే స్వాతంత్య్రం వచ్చేది కాదు. సంస్కరణలు జరిగేవి కాదు. వారిని ఎవరైనా అవహేళన చేస్తే ఊరుకోం’ అని పవన్ స్పష్టం చేశారు.