నాగబాబు కి వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్ ?

-

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకోవడం తో సోషల్ మీడియాలో వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో సెటైర్లు వేయడం జరిగింది. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య పార్టీ నాయకుడు నాగబాబు విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లకు కౌంటర్లు వేస్తూ సోషల్ మీడియాలో..‘జీరో విలువ తెలియని వెధవలకి మనం ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే. ఈ రోజు సైన్స్‌ అండ్‌ మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటర్స్‌ ఇంత డెవలప్‌ అయ్యాయి అంటే సున్నా మహత్యమేరా చదువుకున్న జ్నానం లేని సన్నాసుల్లారా..’ అంటూ పోస్ట్ పెట్టారు.

Image result for pawan kalyan vs nagababu

దీంతో నాగబాబు చేసిన కామెంట్ లపై తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి మరియు అదే విధంగా సీనియర్ రాజకీయ నేతల నుండి నాగబాబు సోషల్ మీడియాలో వాడిన భాషపై విమర్శలు వస్తున్నాయి.

 

దీంతో ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా వెళ్లటంతో నాగబాబు కి వార్నింగ్ ఇచ్చినట్లు ఇలాంటి భాష వాడద్దు అని గట్టిగా చెప్పినట్లు సోషల్ మీడియాలో దిగజారి మాట్లాడటం సబబు కాదని ముఖ్యంగా ఈ సమయంలో అసలు మాట్లాడకు అని నాగబాబు కి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జనసేన మరియు ఏపీ మీడియా వర్గాల్లో వినబడుతున్న టాక్.

Read more RELATED
Recommended to you

Latest news