టీడీపీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావు వియ్యంకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పోటీలో నిలబడటంతో కాపు ఓట్లే కీలకంగా మారాయి.
భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించాలి. దాని కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యారట. దానికోసం పెద్ద పథకమే రచించారట. ఆయన్ను ఓడించడానికి ఏకంగా ఓటుకు 3 వేల రూపాయలు పంచారట. జనసేన మిత్రపక్షం సీపీఐ అదే ఆరోపణలు చేసింది. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి.
భీమవరంలో పవన్ కల్యాణ్ ఓటమి కన్ఫమ్ అని తెలిశాకే సీపీఐ నేత రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే.. భీమవరంలో ప్రధాన పోరు ఇద్దరి మధ్యే. ఒకరు పవన్ కల్యాణ్, మరొకరు వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్. వీళ్లిద్దరి మధ్యే పోరు ప్రధానంగా నడవడంతో ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేదానిపై చాలా విశ్లేషణలు వచ్చాయి. అంతే కాదు.. వీళ్లిద్దరి మధ్య టైట్ ఫైటేనని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే.. పవన్ కల్యాణ్ భీమవరాన్ని ఎంచుకోవడానికి కారణం అక్కడున్న కాపు సామాజిక వర్గ ఓటర్లు. అవును.. దాదాపు 2 లక్షల మంది ఓటర్లు ఉన్న భీమవరంలో కాపు ఓటర్లే ఎక్కువ. అయితే.. వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తే కావడం, మరోవైపు శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ సానుభూతి ఈ ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉండటంతో ఈసారి ఎన్నికల్లో శ్రీనివాస్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట.
మరోవైపు టీడీపీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావు వియ్యంకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పోటీలో నిలబడటంతో కాపు ఓట్లే కీలకంగా మారాయి.
అయితే.. నరసాపురం నుంచి వైసీపీ తరుపున ఎంపీగా పోటీ చేసిన రఘురామకృష్ణంరాజు ప్రభావం భీమవరంపై పడే అవకాశం ఉందట. ఆయన క్షత్రీయ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆయన వర్గం ఓట్లను కూడా వైసీపీకి వేయించడం గ్రంధి శ్రీనివాస్ కు ప్లస్ అయిందట. దీంతో కాపు సామాజిక వర్గం వాళ్ల ఓట్లు, క్షత్రీయ సామాజిక వర్గం వాళ్ల ఓట్లు అన్నీ వైసీపీకే పడ్డాయట. అందుకే.. భీమవరంలో పవన్ ఓడిపోవడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.