ఈటెల‌కు బూస్ట్ ఇచ్చే న్యూస్‌… మ‌ల్కాజ్‌గిరి ఆయ‌న‌దే

-

మ‌ల్కాజ్‌గిరి లోక్‌స‌భ సీటును బీజేపీ అభ్య‌ర్ధి ఈటెల రాజేంద‌ర్ గెల‌వ‌బోతున్నారని స‌ర్వేలు తేల్చేశాయి. మిని ఇండియాగా పేరుపొందిన మ‌ల్కాజ్‌గిరిలోక్‌స‌భ సెగ్మెంట్ లో ఎవ‌రు గెలుస్తార‌నే ఆస‌క్తి ప్ర‌తిఒక్క‌రిలో ఉంది.ఈ నియోజ‌క‌వ‌ర్గం బ‌రిలో బీజేపీ నుంచి మాజీమంత్రి ఈటెల రాజేంద‌ర్ బ‌రిలో నిల‌వ‌డంతో ఈ సీటు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అయితే పీపుల్స్ స‌ర్వే మ‌రియు 26 స్ట్రాట‌జీస్ స‌ర్వే సంస్థ‌లు మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స్థానానికి సంబంధించి ఆస‌క్తిక‌ర న్యూస్‌ని వెల్ల‌డించాయి.ఈ ఎన్నిక‌ల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నట్లు తేల్చేశాయి.మ‌ల్కాజ్‌గిరిలో భార‌తీయ జ‌న‌తాపార్టీకి 46.79 శాతం ఓటు షేరు రానుంద‌ని స‌ర్వేలు చెప్తున్నాయి.మొత్తానికి ఈటెల రాజేంద‌ర్ బంప‌ర్ విక్ట‌రీ కొడ‌తాడ‌ని చెప్ప‌డంతో ఆయ‌న‌తో పాటు బీజేపీ శ్రేణులు జోష్‌లో ఉన్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో స‌ర్వే చేప‌ట్టిన 26 స్ట్రాటజీస్ సర్వే సంస్థ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 1,729 శాంపిల్స్ సేకరించింది. పోటీలో ఉన్న‌ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుని శాంపిల్స్‌ని తీసుకుంది.ఈ సర్వేలో ఈటల రాజేందర్‌కే ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ఈటెలకు 61.1 శాతం, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్‌రెడ్డికి 24.6 శాతం, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 13.1 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు.

ఎటువంటి స్పందన తెలుపని వారు 1.2 శాతం మంది ఉన్నట్లు ఈ స‌ర్వేలో తేలింది.అభివృద్ధి అంశాన్ని ఆధారంగా ఓటు వేస్తామని 42 శాతంమంది, పార్టీని చూసి ఓటు వేస్తామని 34 శాతం మంది, ప్రధాని అభ్యర్థిని చూసి 20.9 శాతంమంది, ఇతర కారణాలతో 1.9 శాతం మంది ఓటు వేయబోతున్నట్లు తెలిపారు. ఇక 63 శాతం మంది పురుష ఓటర్లు, 54 శాతం మంది మహిళా ఓటర్లు ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్ల‌డైంది.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి మల్కాజిగిరి టికెట్ సాధించుకున్న పట్నం సునీతా మహేందర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో గట్టి షాక్ తగలబోతున్నట్లు పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. స్వయంగా సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి బరిలో నిలిచిన ఆమె.. రెండో స్థానానికే పరిమితం కాబోతున్నారని ఈ సర్వే తేల్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. అయితే లోక్‌సభ ఎన్నికల వరకు వచ్చే సరికి పరిస్థితులు తారుమారు అయ్యేలా కనిపిస్తున్నాయి.

ఏడింటికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ వెనుకబడిపోయినట్లు, ప్రధానంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ స్థానంలోనూ గులాబీ పార్టీ థర్డ్ ప్లేస్‌కు పరిమితం కాబోతున్నదని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. మొత్తానికి ఈ స‌ర్వేలు కాంగ్రెస్‌కి కునుకుప‌ట్ట‌నీయ‌కుండా చేస్తున్నాయి.గ‌తంలో మ‌ల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌భావం ఈ ఎన్నిక‌ల్లో క‌నిపించ‌బోద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news