పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేనల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ చేరినట్టుంది.. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటి ఎన్నికలు సెగలు పుట్టిస్తున్నాయి.. మిత్రపక్షనేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటల యుద్దానికి దిగుతున్నారు.. సొసైటీని చేజిక్కించుకుంటామని రెండు పార్టీల నేతలు సవాళ్లు చేసుకుంటున్నారు..దీంతో ఆ నియోకవర్గంలో రాజకీయం రంజుగా మారింది..
ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ సొసైటీని చేజిక్కించుకోవడం గతకొన్నేళ్లుగా జరుగుతోంది.. అయితే ఈ సారి కూటమి ప్రబుత్వం అధికారంలో ఉండటంతో.. నేతల మద్య లోకల్ పొలిటికల్ వార్.. కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల మీద పడింది.. సొసైటీని తామే చేజిక్కించుకోవాలని రెండు పార్టీలకు చెందిన నేతలు పట్టుబడుతున్నారు.. ఈ ఎన్నికను టీడీపీ ఇన్చార్జిగా ఉన్న వర్మ, జనసేన ఇన్చార్జిగా ఉన్న శ్రీనివాస ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు..
ఈ నెల ఆరున ఎన్నిక జరుగుతుంది.. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మిత్రపక్షాలు పోటీ పడుతున్నాయి.. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇలాంటి పోటీ జరగడంపై రాష్ట వ్యాప్తంగా చర్చలకు దారి తీస్తోంది.. మొత్తం ఐదు డైరెక్టర్ ఖాళీలకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి.. పోటీలో ఉన్న 12 మందిబరిలో ఉండగా.. జనసేన ఐదుగురికి. టీడీపీ మరో ఐదుగురికి సపోర్ట్ చేస్తోంది.. దీంతో గెలుపెవరిది అనేది ఆసక్తికరంగా మారింది..కూర్చునిమాట్లాడుకుంటే.. ఏకగ్రీవం అవతాయని.. అయితే నేతలు కావాలనే రచ్చ చేసుకుంటున్నారని లోకల్ గా చర్చ జరుగుతోంది..
ఈ డైరెక్టర్ పోస్టులపై ఎవ్వరూ తగ్గకపోవడంతో.. నేరుగా గ్రౌండ్ లోనే చూసుకుందామన్న దోరణిలో నేతలు బలప్రదర్శనకు దిగారు.. దీంతో ఎన్నడూ లేని హడావుడి ఈసారి కనిపిస్తోంది.. నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే.. పవన్ కళ్యాణ్ కు తెలియకుండా ఉందా..లేక తెలిసినా.. లైట్ తీసుకుంటున్నారా..అనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. దీనిపై ఇద్దరు అధినేతలు ఎలా స్పందిస్తారో చూడాలి..