రక్తం మరిగిపోతోంది… ప్రతీకారం తీర్చుకోవడమే ఇక…!


జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడిపై ప్రధాని మోదీ స్పందించారు. జవాన్లపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని హెచ్చరించారు. ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన జవాన్లకు ప్రధాని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీఎం.. అమరులైన జవాన్ల కుటుంబాలకు ఈ దేశమే తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ దాడిని దేశమంతా ఖండిస్తోందని… 130 కోట్ల మంది భారతీయుల రక్తం మరిగిపోతోందని అన్నారు. పుల్వామా దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని మోదీ స్పష్టం చేశారు. దాడి చేసిన ఉగ్రవాదులే కాదు.. ఉగ్రదాడికి సహకరించిన పాకిస్తాన్ ను కూడా వదిలేది లేదని మోదీ హెచ్చరించారు.