పీవోకే తీర్మానం పీవీ హయాంలోనే!

-

ఆర్టికల్ 370 పై ప్రముఖ రాజకీయ నాయకుడు సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ ఇది స్వాగతించాల్సిన అంశమే అన్నారు. అంతే కాకుండా ప్రధాని మోడీ, హోంమంత్రికి ఈ విషయంలో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పీవోకే పై మాట్లాడుతూ… పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలంటూ పీవీ నిరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే భారత పార్లమెంట్ తీర్మాం చేసిందనే విషయాన్ని స్వామి గుర్తు చేసారు.

POK Resolution During the pv narasimha rao

ఆర్టికల్ 370ని రద్దుచేసేందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్న కాంగ్రెస్ వాదన వారి అజ్ఞానాన్ని సూచిస్తోందని దుయ్యబట్టారు. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం ప్రకారం నడుచుకుంటుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ తీర్మానాన్ని పార్లమెంటుకు తెలియజేయడాన్ని సముచిత చర్యగా భావిస్తున్నానని స్వామి వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు ఇప్పటికే ఆలస్యమైంది. ఆర్టికల్ రద్దు ఏకపక్షమని వాదించే వారికి.. లక్షదా మంది కశ్మీరీ పండిట్‌లను, సిక్కులను తరిమివేసిన రోజు గుర్తులేదా అంటూ ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయంటూ స్వామి ఫైర్ అయ్యారు.

ఇక ప్రభుత్వ తదుపరి అడుగు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడమే అంటూ సీరియస్ కామెంట్ చేశారు. పీవోకేను భారత్‌కు తిరిగి అప్పగించమని పాకిస్తాన్ ప్రధానికి చెప్పడం తప్ప, ఇక మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమీ మిగలలేదని సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం ప్రకారం నడుచుకుంటోందని సుబ్రమణ్య స్వామి వివరించారు.

 

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news