తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదిగేందుకు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) బీఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన టీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన విమర్శలు చేస్తే ప్రజల్లో కూడా వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉందని గ్రహించిన టీఆర్ఎస్ నేతలు ఆయనపై తిరుగుబాటును మొదలు పెట్టారు. ఇక ఇందుకోసం పకడ్బందీగా వ్యూహం రచిస్తున్నారు.
ఇక ఎలాగైనా ప్రవీణ్‌ను ఎదుర్కొనేందుకుగాను అధికార టీఆర్ఎస్ పార్టీ కొత్త ప్లాన్లను తెరమీదకు తెచ్చేందుకు ట్రై చేస్తోంది. ఎందుకంటే ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేస్తే చులకన అయిపోతామని గ్రహించిన టీఆర్ఎస్ నేతలు ప్రవీణ్ కుమార్ కరీంనగర్ జిల్లాలో ఎస్పీగా ఉన్న సమయంలో ఆయన దళిత మావోయిస్టులను టార్గెట్ చేసి చంపించారనే ఆరోపణలు ఉండటంతో వాటినే అస్త్రంగా చేసుకుంటోంది.
ఇక ఇప్పుడు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆర్ ఎస్పీపై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు గులాబీ దళం ట్రై చేస్తోంది. అలాగే ప్రవీణ్ కుమార్ దీంతో ఉస్మానియా స్టూడెంట్స్ పై, ఉద్యమకారులపైన అక్రమ కేసులు పెట్టారనే వాటిని కూడా మళ్లీ తెరమీదకు తెస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. దీంతో ఈ విధంగా ప్రవీణ్ కుమార్‌కు చెక్ పెట్టొచ్చని గులాబీ దళం భావిస్తోంది. అయితే ఇలాంటి ఆరోపణలను కేవలం సెకండ్ గ్రేడ్ నాయకులతోనే చేయిస్తోంది. చూడాలి మరి ఏ మేరకు సక్సెస్ అవుతాయో.