ఆర్.ఆర్.ఆర్. మరీ దిగిపోతున్నారుగా!

గత కొంత కాలంగా ఏ పార్టీ బీ ఫారం పై ఎన్నికల్లో పోటీచేశారో.. ఏ పార్టీ సింబల్ పై ఎన్నికల్లో నిల్చున్నారో.. ఏ పార్టీ అధినేత వల్ల గెలిచారో ఆ పార్టీని, అధినేతను ఇరుకునపెట్టడానికి “రచ్చ”బండ అంటూ తనవంతు ప్రయత్నం తాను పుష్కలంగా చేస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజు… విమర్శల్లో తనదైన తెలివితేటలు చూపిస్తున్నారు.

raghu
raghu

తాజాగా మైకందుకున్న ఆర్.ఆర్.ఆర్. వర్షం వచ్చి కూలిపోయిన టెంటులను కూడా తన ప్రచారానికి, జగన్ ను ఇరుకునపెడుతున్నామనే ఆనందానికి వాడేసుకుంటున్నారు. నవ్విపోదురుగాక… అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఎన్నికల విషయంలో జగన్ భయపడుతున్నారని చెప్పుకొస్తున్నారు! అవును… నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికల కమిషనర్ గా ఉంటే ఏకగ్రీవాలు జరగవని జగన్ భయపడుతున్నారని చెప్పుకొస్తున్నారు ఆర్.ఆర్.ఆర్.

తన వల్ల పదిశాతం, జగన్ బొమ్మ వల్ల తొంభై శాతం తన గెలుపులో భాగముండొచ్చని మొదట్లో చెప్పిన ఆర్.ఆర్.ఆర్… 151 సీట్లు సంపాదించుకున్న జగన్.. స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడుతున్నారని చెప్పడంలో టీడీపీ నేతలను మించి విశ్లేషిస్తున్నారు! దీంతో… విమర్శలకు కూడా ఒక పద్దతుండాలి ఆర్.ఆర్.ఆర్… పునాదులు మరిచిపోతే ఎలా? నేడు హస్తినలో తమరి హడావిడి జగన్ పెట్టిన బిక్షే కారణం అన్న విషయం మరిచిపోకూడదని హితవు పలుకుతున్నారు నెటిజన్లు!