ఐపీఎల్:ప్లే ఆఫ్ లో ఈ ఇక్వేషన్లే కీలకం…!

ప్లే ఆఫ్‌ బెర్త్‌లు నాలుగు ఖరారైపోయాయి. ఇక క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లు, ఎలిమినేషన్‌ మ్యాచ్‌ ఎవరి మధ్య జరగబోతున్నాయి? నాలుగు జట్లలో రెండు ఫైనల్‌కు చేరాలంటే.. ఎలాంటి ఈక్వేషన్స్‌ ఉంటాయి? IPL లీగ్‌ దశ ముగిశాక… ముంబై తొలి స్థానంలో, ఢిల్లీ రెండో ప్లేస్‌లో, సన్‌రైజర్స్‌ మూడో స్థానంలో, బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచాయి. వీటిల్లో ముంబై, ఢిల్లీ మధ్య తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ రేపు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌ చేరుకుంటుంది.

మూడోస్థానంలో నిలిచిన సన్‌రైజర్స్‌, నాలుగో స్థానంలో ఉన్న బెంగళూరు మధ్య ఎల్లుండి ఎలిమినేషన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు… తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో… రెండో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌ ఆదివారం జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది.ఇక ఫైనల్‌ మ్యాచ్‌ నవంబర్‌ 10న జరగనుంది.