వారు చనిపోయిన విషయం ప్రపంచానికి తెలుసుగాని మోడీకి తెలీదు

లాక్ డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియదని పార్లమెంట్ లో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. “లాక్డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారో, ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారో మోడీ ప్రభుత్వానికి తెలియదు” అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

rahul-gandhi
rahul-gandhi

” అవును, మీరు లెక్కించ లేదు, ఎవరూ చనిపోలేదు? కానీ ప్రభుత్వంపై ఇది ఎలాంటి ప్రభావం చూపకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. వారు చనిపోతున్నట్లు ప్రపంచం చూసింది కాని మోడీ ప్రభుత్వం మాత్రం చూడలేదని రాహుల్ గాంధీ అన్నారు. మహమ్మారి సమయంలో వలస కార్మికుల మరణాల గురించి ప్రభుత్వానికి ఎలాంటి రికార్డులు లేవని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సోమవారం చెప్పిన సంగతి తెలిసిందే.