కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. మైసూరులో పాదయాత్ర సాగించిన రాహుల్ గాంధీ.. భారీగా తరలివచ్చిన జనంతో నడక ముందుకు సాగించారు. ఈ యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అయినా.. తగ్గేదేలే అంటూ రాహుల్ తన ప్రసంగాన్ని జోరు వానలోనూ కొనసాగించారు.
దేశ గొంతుకను వినిపించే విషయంలో ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగే ‘భారత్ జోడో యాత్ర’నూ ఎవరూ ఆపలేరు’ అని రాహుల్ గాంధీ అన్నారు. గాంధీ సిద్ధాంతాలను వల్లించడం కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి సులభంగానే ఉంటుంది కానీ, ఆయన అడుగు జాడల్లో నడవడం మాత్రం వాళ్లకు కష్టమని విమర్శించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఇది కొనసాగనుంది.
भारत को एकजुट करने से,
हमें कोई नहीं रोक सकता।भारत की आवाज़ उठाने से,
हमें कोई नहीं रोक सकता।कन्याकुमारी से कश्मीर तक जाएगी, भारत जोड़ो यात्रा को कोई नहीं रोक सकता। pic.twitter.com/sj80bLsHbF
— Rahul Gandhi (@RahulGandhi) October 2, 2022