మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే దేశమంతా అట్టుడికిపోయే సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)లకు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో తీవ్రమైన ఆందోళనలో వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి నిర్ణయాల వల్ల దేశం విడిపోయే పరిస్థితి ఉంటుందని ప్రజల మధ్య గొడవలు కలుగుతాయని ప్రజాస్వామ్యానికి మరియు ప్రజా జీవితానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలపై తీవ్రమైన వ్యతిరేకత విపక్ష పార్టీల నుండి వ్యక్తమవుతోంది.
అయితే మరోపక్క పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)లకు మద్దతుగా నిలిచింది మహారాష్ట్ర నవనిర్మాణ సేన. ఈ నేపథ్యంలో సీఏఏ, ఎన్నార్సీలకు బిల్లుకు మద్దతుగా మహారాష్ట్ర లో ముంబైలో ఆజాద్ మైదానంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే మాట్లాడుతూ.. ఈ రెండింటికీ వ్యతిరేకంగా ముస్లింలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదన్నారు.
వ్యతిరేక ప్రదర్శనలు చేస్తూ దేశంలో హింసకు పాల్పడుతున్నారని ఇలా అయితే ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. రాయికి రాయితో, కత్తికి కత్తితో సమాధానం చెబుతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ధర్మశాల కాదని, పాకిస్థాన్, బంగ్లాదేశ్ చొరబాటుదారులను వెంటనే దేశం నుంచి వెనక్కి పంపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వారిని తరిమివేసేందుకు పోలీసులకు 48 గంటలపాటు స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్రాన్ని రాజ్ థాకరే కోరారు.