గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ పై కేసు నమోదైంది. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసును నమోదు చేశారు పోలీసులు. ఇటీవల యూపీ ఎన్నికలపై, ఓటర్లపై అనుచితంగా… భయపెట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీ చర్యలకు ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళ్ హాట్ పీఎస్ లో కేసు నమోదైంది.
ఇటీవల యూపీ ఎన్నికల సందర్భంగా రాజాసింగ్ ఓటర్లను భయపెట్టే విధంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయకుంటే.. జేసీబీలు, బుల్డోజర్లు పంపిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఉండాలంటే…యోగీ బాబాకు జై అనాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయకుంటే.. యూపీ వదిలి పారిపోవాలని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనికి రాజాసింగ్ స్పందించకపోవడంతో.. కేసు నమోదైంది.