సజ్జన్నార్ కు రాజా సింగ్ వార్నింగ్… నేనే రంగంలో దిగుతా

ఈ మధ్య బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా గోవుల విషయంలో ఆయన స్పీడ్ గా ఉన్నారు. హైదరాబాద్ పోలీసులు గో అక్రమ తరలింపు విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆయన పోలీసుల కంటే ముందుగానే మరో రాష్ట్రానికి తరలిస్తున్న గోవులను పట్టుకున్నారు. ఆ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఇక తాజాగా సైబరాబాద్ సీపీకి రాజా సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఐదు రోజుల్లో గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే రంగంలోకి దిగుతానని వార్నింగ్ ఇచ్చారు. బహుదూర్ పుర పీఎస్ ముందు నుంచి ఆవుల అక్రమ తరలిస్తోన్న వీడియోలను ఆధారాలతో బయట పెట్టిన రాజసింగ్… మీకు చేతకాకుంటే అనే పదాన్ని నేను ఉపయోగించవచ్చు.. కానీ పోలీస్ కమిషనర్ పై నాకు గౌరవం ఉంది అని అన్నారు.

ఇప్పటికైనా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేసారు. రాజకీయ నాయకులపై కామెంట్స్ చేయటం కాదన్న ఆయన… అక్రమంగా గోవులను తరలిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. గో రక్షణ విషయంలో బిజెపి అధిష్టానాన్ని అయినా సరే తాను ఎదుర్కొంటా అంటూ ఇటీవల ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసారు.