బీఆర్ఎస్ పార్టీపై రామ్ గోపాల్ వర్మ క్రేజీ కామెంట్

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేసినప్పటి నుంచి చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు మద్దతినిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులే కాక సినీ ప్రముఖులు కూడా జాతీయ పార్టీపై స్పందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బీఆర్ఎస్ పార్టీపై కామెంట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చడంపై టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్నట్టు పేర్కొన్న వర్మ.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన ఆదిపురుష్‌ కేసీఆర్‌ అంటూ తనదైన శైలిలో కొనియాడారు.

వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తనదైన మాటలతో ఆకట్టుకునే వర్మ.. తాజాగా ఆదిపురుష్‌ వివాదానికి ముడిపెట్టి కేసీఆర్‌కు స్వాగతం పలకడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వర్మ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.