నాలుగు దశాబ్దాల చరిత్ర గల తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి. ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ramana కూడా పార్టీ మారడానికి రెడీ అయిపోయారు. దీంతో తెలంగాణలో టీడీపీ చాప్టర్ క్లోజ్ అని విశ్లేషణలు వస్తున్నాయి. మామూలుగా తెలంగాణలో టీడీపీకి గ్రామ స్థాయి నుంచి బలం ఉండేది. ఎన్టీఆర్, చంద్రబాబులు ఉమ్మడి ఏపీకి సీఎంలుగా ఉన్నప్పుడు తెలంగాణలో టీడీపీకి తిరుగులేదు.
కానీ 2004 నుంచి టీడీపీ పరిస్తితి దిగజారుతూ వస్తుంది. 2004, 2009లలో టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇక రాష్ట్ర విభజన జరిగాక టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. 2014లో ఘోరంగా ఓడింది. ఆ తర్వాత చాలామంది నాయకులు టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. మరికొందరు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. 2018లో టీడీపీ మరీ ఘోరంగా ఓడిపోయింది. ఇక ఆ తర్వాత నుంచి టీడీపీ మనుగడ కష్టమైపోయింది. మళ్ళీ నాయకులు టీఆర్ఎస్, బీజేపీల్లోకి వెళ్లారు.
దీంతో ఆ పార్టీలో నలుగురైదుగురు నాయకులు మాత్రమే మిగిలారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధ్యక్షుడు రమణ సైతం టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీకి దాదాపు ఎండ్ కార్డ్ పడిపోయినట్లే. ఇదే సమయంలో టీడీపీ నిలబడాలంటే నందమూరి ఫ్యామిలీ పగ్గాలు అప్పగించాలని కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తుంది. ఇప్పటికే పార్టీలోకి ఎన్టీఆర్‌ని తీసుకురావాలని రెండు రాష్ట్రాల్లో డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఇప్పటిలో రాజకీయాల్లోకి వచ్చేలా కనిపించడం లేదు. కాబట్టి నందమూరి సుహాసినకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మరి చూడాలి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?